Mohanlal: ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పహల్గాం ఎటాక్, ఆపరేషన్ సింధూర్ ఘటనల ఆధారంగా మలయాళంలో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు మలయాళ సీనియర్ డైరెక్టర్ మేజర్ రవి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ వార్ బ్యాక్‌డ్రాప్ మూవీకి పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ భారీ బడ్జెట్ మూవీ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఫీషియల్‌గా మోహన్‌లాల్ పేరును అనౌన్స్ చేయకముందే ఈ సినిమాను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read – Tamannaah: మన శంకర వరప్రసాద్‌గారుతో తమన్నా స్పెషల్ నంబర్..!
బాయ్ కాట్ మేజర్ రవి హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ మూవీ చేయద్దంటూ మోహన్‌లాల్‌ను ఉద్దేశించి నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఒకవేళ మోహన్‌లాల్ ఈ సినిమాలో నటిస్తే థియేటర్లలో చూడనని, సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్‌ను పోస్ట్ చేయనని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఫస్ట్ టైమ్ మోహన్‌లాల్ మూవీ ఫ్లాప్ కావాలని కోరుకుంటున్నానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి చెత్త డైరెక్టర్లతో సినిమాలు చేసేకంటే ఇన్నేవేటివ్ కాన్సెప్ట్‌లతో మూవీస్ చేయడం మంచిదంటూ చాలా మంది ఫ్యాన్స్ కామెంట్స్, ట్వీట్స్ చేస్తున్నారు.
మోహన్‌లాల్, మేజర్ రవి కాంబినేషన్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోనే వీరిద్దరు కలిసి కురుక్షేత్రం, కర్మయోధ, కాందహార్‌తో పాటు 1971 బియాండ్ బార్డర్స్ సినిమాలు చేశారు. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. మరోవైపు లూసిఫర్ సీక్వెల్ సమయంలో మోహన్‌లాల్ స్క్రిప్ట్‌లు వినకుండా సినిమాలు చేస్తాడంటూ మేజర్ రవి కామెంట్స్ చేయడం వివాదానికి దారితీసింది. డిజాస్టర్స్‌తో పాటు ఈ కాంట్రవర్సీని దృష్టిలో పెట్టుకొని మోహన్‌లాల్‌ను ఈ సినిమా చేయద్దంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ను మోహన్‌లాల్ వింటాడో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2015లో వచ్చిన పికెట్ 43 మూవీ ఫ్లాప్‌తో పదేళ్ల పాటు మెగాఫోన్‌కు దూరమయ్యారు మేజర్ రవి. మళ్లీ పహల్గామ్ ఆపరేషన్ సింధూర్‌తో రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆరంభంలోనే ట్రోల్స్ రావడంతో మరో హీరోతో మేజర్ రవి ఈ సినిమా చేస్తారా? లేదంటే? పక్కన పెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read – Keerthy Suresh: ఎట్టకేలకు థియేటర్లలోకి కీర్తి సురేష్ రివాల్వర్ రీటా – రామ్ పోతినేనికి పోటీగా రిలీజ్!


