Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMohanlal: మోహన్‌లాల్‌కు ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు.. విశిష్ట సేవలకు గుర్తింపు

Mohanlal: మోహన్‌లాల్‌కు ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు.. విశిష్ట సేవలకు గుర్తింపు

Mohanlal DadaSaheb Phalke Award: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ అత్యున్నత ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు శనివారం కేంద్ర సమాచార ప్రసార శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘X’ వేదికగా పోస్ట్ చేసింది. కాగా 2023వ ఏడాదికి మోహన్ లాల్ ఈ అవార్డు అందుకోనున్నారు. 

- Advertisement -

ఈ నెల 23న ఢిల్లీలో జరగబోయే 71వ నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మోహన్‌లాల్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్ లాల్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రశంసలు కురిపించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా సినీ రంగానికి అద్భుత సేవలు అందించారని పేర్కొంది. ‘మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం.’ అంటూ ‘X’లో వెల్లడించింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/28-yeras-later-ott-netflix-streaming/

మోహన్‌లాల్‌ ఇప్పటివరకూ మొత్తం 6 జాతీయ అవార్డులను అందుకున్నారు. స్పెషల్‌ జ్యూరీ అవార్డుల విభాగాల్లో నాలుగు విభాగాల్లో అవార్డు, ఉత్తమ నటుడిగా రెండు అవార్డులతో పాటు, వానప్రస్థానం సినిమాకు నిర్మాతగా మరో అవార్డును మోహన్‌లాల్‌ దక్కించుకున్నారు. ఇక కేరళ రాష్ట్ర అవార్డులు, ఫిలిం ఫేర్‌ అవార్డులు ఆయన నటనకు క్యూ కట్టాయి. సినీ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో ఆయన గౌరవం మరింత పెరిగింది.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad