మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ యూనిట్.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చింది. ఇవాళ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసింది. ఈ వీడియోలో మోహన్ లాల్ కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా గ్లింప్స్ ఎడిట్ చేశారు. దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్ లాల్ పోషించారు.
ప్రస్తుతం విష్ణు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ టూర్‌ను పూర్తి చేశారు. ఈ మూవీలో సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు నటించడం విశేషం. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల, కాజల్, తదితర నటులు కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.