AR Rahman| ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో రెహమాన్ మ్యూజిక్ బృందంలోని బాసిస్ట్ మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో వీరిద్దరికి ఏమైనా సంబంధం ఉందా..? అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై మోహినిదే(Mohini Dey) స్పందించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
‘నేను విడాకుల గురించి ప్రకటన చేసినప్పటినుంచి ఇంటర్వ్యూల కోసం ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. నా ఇంటర్వ్యూలు ఎందుకు అడుగుతున్నారో తెలుసు. నేను అందరి అభ్యర్థనను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు అనుకుంటున్న దాని గురించి మాట్లాడడానికి నాకు ఆసక్తి లేదు. ఇలాంటి వదంతులపై మాట్లాడి విలువైన సమయాన్ని వృథా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి’ అని ఆమె అందులో రాసుకొచ్చారు.