మంచు కుటుంబం(Manchu Family) వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్(Manchu Manoj)పై ఆయన తల్లి నిర్మలా దేవి(Nirmala Devi) సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 14న జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో జనరేటర్‌లో విష్ణు(Vishnu) పంచదార పోశారంటూ మనోజ్ చేసిన ఫిర్యాదులో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు పోలీసులకు ఆమె బహిరంగ లేఖ రాశారు.
ఈ పార్టీలో విష్ణు ఎవరితో గొడవ పెట్టుకోలేదని.. కేక్ కట్ చేయించి తన రూంలో ఉన్న సామానులు తీసుకుని వెళ్లిపోయాడని ఆమె తెలిపారు. తన చిన్న కొడుకు మనోజ్‌కు జల్‌పల్లి ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉందని పేర్కొన్నారు. విష్ణు ఎటువంటి దౌర్జన్యం చేయలేదని.. మనుషులను తీసుకుని రాలేదని వివరించారు. అంతకు మించి అక్కడ ఏం జరగలేదని ఆమె వెల్లడించారు.