MOULI: యూట్యూబ్ నుండి టాలీవుడ్‌కి
విజయవాడలో సరదాగా ఫుడ్ వ్లాగ్స్, ఆ తర్వాత తనదైన ఫన్నీ వీడియోలతో యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ (90’s మిడిల్‌క్లాస్ బయోపిక్ ఫేమ్) ఇప్పుడొక మెయిన్ స్ట్రీమ్ హీరోగా మారాడు. అతని ఈ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/salman-khan-murugadoss-sikandar-fight/
తాజాగా విడుదలైన తన తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో మౌళి తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా, యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తన సహజమైన నటన, కామెడీ టైమింగ్‌తో మౌళి తనేంటో నిరూపించుకున్నాడు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో వచ్చిన భారీ విజయంతో మౌళికి టాలీవుడ్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ మౌళితో సినిమా చేసేందుకు ముందుకు వచ్చింది.
తాజా సమాచారం మేరకు, తన రెండవ సినిమా కోసమే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మౌళి కోటి రూపాయల అడ్వాన్స్ చెక్ తీసుకున్నాడు. తొలి సినిమాతోనే తన సత్తా నిరూపించుకున్న ఒక యువ నటుడికి, రెండో సినిమాకే కోటి రూపాయల రెమ్యునరేషన్ లభించడం అనేది తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన గుర్తింపు!
ALSO READ: https://teluguprabha.net/cinema-news/bhargav-ram-jr-ntr-son-trending/
సోషల్ మీడియా నుండి వచ్చి, కేవలం ఒక్క సినిమాతోనే అగ్ర నిర్మాణ సంస్థను ఆకర్షించిన మౌళి తనూజ్ ప్రశాంత్ విజయ గాథ… కృషి, ప్రతిభ ఉంటే సక్సెస్ మీ అడుగుల చెంతకు వస్తుందని నిరూపించింది.


