Vishwambhara Item Song: విశ్వంభరకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో పడ్డారు మెగాస్టార్ చిరంజీవి. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. బ్యాలెన్స్‌గా మిగిలి ఉన్న స్పెషల్ సాంగ్ షూటింగ్ నేటి నుంచి (శుక్రవారం) మొదలు కాబోతుంది. ఈ సాంగ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో మేకర్స్ గ్రాండియర్ సెట్ వేసినట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారు. నాలుగు రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరుగనున్నట్లు సమాచారం.
మౌనీరాయ్ ఎంట్రీ…
విశ్వంభర స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ స్టెప్పులు వేయబోతున్నది. హైదరాబాడ్‌లో ఉన్నట్లుగా చెబుతూ కొన్ని ఫొటోలను గురువారం ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది మౌనీరాయ్. విశ్వంభర సాంగ్ షూటింగ్ కోసమే మౌనీరాయ్ హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన మౌనీరాయ్ విశ్వంభరతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
ఫ్యాన్స్‌కు ట్రీట్…
మెగా ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్‌లా విశ్వంభర స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం. మ్యూజిక్ కంపోజింగ్, డ్యాన్స్ స్టెప్పుల విషయంలో మేకర్స్ ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నట్లు తెలిసింది. చిరంజీవి కెరీర్‌లోనే పలు సూపర్ హిట్ సాంగ్స్ రిఫరెన్స్‌లు ఈ పాటలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
Also Read – HHVM Collections: ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. పవర్ చూపించిన పవన్ కళ్యాణ్
త్రిష హీరోయిన్…
విశ్వంభర మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. విశ్వంభర మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యలోకం బ్యాక్‌డ్రాప్‌లో విశ్వంభర కథ సాగుతుందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట మల్లిడి పేర్కొన్నారు. పధ్నాలుగు లోకాలు దాటి హీరో సత్యలోకం ఎందుకు వెళ్లాడన్నది ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పాడు.
సంక్రాంతికే రావాల్సింది…
విశ్వంభర మూవీకి ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సోషియా ఫాంటసీ మూవీ ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేశారు. అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
విశ్వంభరతో పాటు ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓ మూవీ చేస్తున్నారు చిరంజీవి. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. ఇటీవలే కేరళలో మూడో షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read – Balakrishna: బాలయ్య స్పీడు మామూలుగా లేదుగా! – క్రిష్‌తో నాలుగో సినిమా కన్ఫామ్


