రాత్రికి రాత్రే సెలబ్రేటీ కావటం అంటే నమ్మశక్యం కాదు. నిజమని నిరూపించింది ఈ 16 ఏళ్ల అమ్మాయి. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్, థ్రేడ్స్ (thread), ఎక్స్, వాట్సాప్ మెుదలైన అన్ని సోషల్ మాధ్యమాలు ఓపెన్ చేసిన ఈ అమ్మాయే ప్రత్యక్షం అవుతుంది.
కథనాలు, వీడియోలు, రీల్స్ తో హట్ టాఫిక్ గా మారింది. తన సహజ సౌందర్యంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ మెనాలిసా భోస్లేకు ఎందుకు ఇవ్వకూడదు సినిమా ఛాన్స్ అని నెటిజన్లు ఓ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా అన్ని మాధ్యమాల్లో మారు మ్రోగుతున్న మోనాలిసాను బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా చూసి.. ఒకింతా ఆశ్చర్యానికి గురయ్యాడు. దీంతో ఆమెకు బాలీవుడ్ ఆఫర్ ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన తర్వాత సినిమా అయిన “డైరీ ఆఫ్ మణిపూర్”లో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు.
త్వరలోనే డైరెక్టర్ సనోజ్ మిశ్రా… మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి వెళ్లి న్యాచురల్ బ్యూటీ మోనాలిసా కుటుంబాన్ని కలుస్తానన్నారు.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నివసించే మోనాలిసా కుటుంబం కొన్ని ఏళ్ల నుంచి పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో ఈమె దండలు అమ్ముతుండగా అక్కడికి వెళ్లిన కొంతమంది యువకులు ఈ 16 ఏళ్ల అమ్మాయి మోనాలిసా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా రాత్రికి రాత్రే సెలబ్రేటీ అయిపోయింది.
ప్రస్తుతం అన్ని మాధ్యమాల్లో మోనాలిసా పేరు మారు మ్రోగుతుంది. మరి ఈ అందాల ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో ఆఫర్ వస్తుందని తెలియటంతో నెటిజన్స్ అభినందనలతో హోరెత్తిస్తున్నారు.