Movie Release: టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు, మనీ రైన్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులలోకి ఎంతో పబ్లిసిటీ పెంచుతోంది ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం. ఈ విషయంపై అనేక ప్రాంతాల నుంచి మంచి స్పందన వస్తుందని నిర్మాత రాజా దారపునేని వెల్లడించారు. జూలై 11న ఈ చిత్రం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్‌కి ధన్యవాదాలు తెలిపారు.
“సునీల్ గారు తమ సినిమాపై ఎంతో నమ్మకంతో రిలీజ్ చేయడానికి తీసుకున్నారు. దానికి మనస్పూర్తిగా సునీల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు దయానంద్ నేనూ అనుకున్న కథను మంచి క్వాలిటీతో తెరపైకి తీసుకొచ్చాము. చిత్రంలో నటించిన నటీనటులంతా తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. కేవలం చిత్రంలో నటించడమే కాదు డబ్బింగ్ ఇంకా ఇతర ప్రమోషన్స్‌లో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. సినిమాలో నటించిన మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, బబ్లు, కౌషల్, జెనీఫర్, రోనీత్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ మూవీ ఎంతో అద్భుతమైన నిర్మాణ విలువలతో ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్ కు నచ్చేలా ఉండబోతుంద”ని నిర్మాత అన్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే ప్రమోషన్ ఎంతో చురుకుగా ముందుకు వెళ్తున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మూవీ టికెట్లు కూడా శరవేగంగా అమ్ముడవుతున్నాయి.
అలాగే థియేటర్లలో మనీ రైన్ పడితే తొక్కిసలాట జరుగుతుంది కదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని నిర్మాత స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తుందని ఆయన అన్నారు.
‘వర్జిన్ బాయ్స్’ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా రాజ్ గురు బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మించారు. ఈనెల 11వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ మిత్రా శర్మ, గీతానంద్ హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీహాన్, కౌశల్, రోనీత్, సుజిత్ కుమార్, జెనీఫర్, బబ్లూ, అభిలాష్, అన్షుల తదితరులు కీలకపాత్రలో పోషించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఈ చిత్రానికి సినిమాకు ఎడిటింగ్ చేయగా.. వెంకట ప్రసాద్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.


