Mrunal Thakur: ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలలోనూ నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. నార్త్, సౌత్ అని తేడా లేకుండా ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ వరుస సినిమాలను ఒప్పుకుంటోంది. టాలీవుడ్ లో ‘సీతారామం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో.. సీతామహాలక్ష్మిగా అందరి మనసులను ఎలా గెలుచుకున్నారో తెలిసిందే. మృణాల్.. తెలుగులో ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నారు. ఈ సక్సెస్ తో నాని సరసన ‘హాయ్ నాన్న’ మూవీ చేసే ఛాన్స్ అందుకున్నారు. దీంతో మరో హిట్ ని మృణాల్ ఠాకూర్ తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే, బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న మృణాల్, ఆ వెంటనే ఫ్యామిలీ స్టార్ మూవీతో వచ్చింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటే.. అది కాస్త బెడిసికొట్టింది. అయినా, మృణాల్ క్రేజ్ కాస్తైనా తగ్గలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఇందులో జూలియట్ పాత్రలో సందడి చేయనున్నారు. అలాగే, హిందీలో మూడు సినిమాల్లో నటిస్తుండటం ఆసక్తికరం. బాలీవుడ్ లో మృణాల్ సాలీడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది.
Also Read – Devara 2: సెట్స్ పైకి వచ్చేస్తోన్న దేవర 2.. క్రేజీ అప్ డేట్
హిందీలో మృణాల్ ఠాకూర్..’సూపర్ 30′, ‘బాట్లా హౌస్’ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ ను అందుకోలేదు. కానీ, ఆఫర్స్ విషయంలో మాత్రం ఈ బ్యూటీకి ఢోకా లేదు. ప్రస్తుతం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘తుమ్ హో తో’, ‘పూజా మేరీ జాన్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ‘సన్ ఆఫ్ సర్దార్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్, ఈ సినిమాలో అజయ్ దేవగన్ కి జంటగా నటించింది. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు. అయితే, ఈ మూవీ ఫ్లాపైంది. దీంతో, ఇప్పుడు మృణాల్ కి ఠఫ్ టైమ్ నడుస్తోంది. హిందీలో నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు గ్యారెంటీగా హిట్ అవ్వాల్సిందే.
అయితే, ఇలా మృణాల్ కి ఫ్లాప్స్ రావడం వెనక కారణం ఎడాపెడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోవడమే అంటున్నారు విశ్లేషకులు. సక్సెస్‌లు వస్తున్న సమయంలో ఇంకాస్త జాగ్రత్తపడి స్క్రిప్ట్స్ ని చాలా సెలెక్టెడ్‌గా ఫైనల్ చేసుకుంటే, ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదంటున్నారు. నిజమే, తెలుగులోనూ మృణాల్ ఇలాంటి రాంగ్ స్టెప్పే వేసింది. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ మూవీని చూసి ఎంచుకుంటే బావుండేది. అలా కాకుండా స్టార్ హీరో.. బడా నిర్మాణ సంస్థ అని ‘ఫామిలీ స్టార్’ ఒప్పుకోవడం వల్ల కాస్త గ్యాప్ రాక తప్పలేదు. ప్రస్తుతం చేస్తున్న ‘డెకాయిట్’ మూవీతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాల్సి ఉంది మృణాల్.
Also Read – Coolie Pre Release Event: నాగార్జున విలన్ పాత్రపై రజినీ కామెంట్స్.. తనపై తనే సెటైర్ వేసుకున్న సూపర్ స్టార్


