Mrunal Thakur : సీతారామం సినిమాలో తన నటన, హావభావాలతో యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో అందర్నీ మెప్పించి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ సినిమాతో వచ్చిన ఫేమ్ తో వరుస సినిమాలు హీరోయిన్ గా చేస్తుంది అనుకుంటే ఓ బాలీవుడ్ సినిమాలో చెల్లెలి పాత్ర చేస్తుంది ఈ బాలీవుడ్ భామ.
బాలీవుడ్ లో 1971లో ఇండియా పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పిప్పా అనే సినిమా రాబోతుంది. బ్రిగేడియర్ మోహతా రాసిన ‘ది బర్నింగ్ చాఫీస్’ అనే పుస్తక ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పిప్పా సినిమాలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది.
చెల్లెలి పాత్ర చేయొద్దు అని, అలా చేస్తే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయని పలువురు మృణాల్ కి చెప్పినా వినకుండా ఆ పాత్ర చేసేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ దీనిపై మాట్లాడుతూ.. ”చెల్లెలి పాత్ర చేయొద్దని నాకు చాలా మంది చెప్పారు. చెల్లెలి పాత్రలో నటిస్తే తర్వాత హీరోయిన్ గా కూడా ఆఫర్స్ రావని చెప్పారు. ఈ సినిమాలో నటించొద్దు అన్నారు. కానీ నాకు తెలిసినంతవరకు అది అబద్దం. మనమేంటో నిరూపించుకోవాలంటే అన్ని రకాల పాత్రలని చేయాలి, ఏ పాత్రలోనైనా ప్రేక్షకులని మెప్పించగలగాలి. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మంచి పాత్రని మిస్ చేసుకున్నాం అనే బాధ ఉండకూడదు. పిప్పా సినిమాలో నా పాత్ర అలాంటిదే. ఆ సినిమాలో చెల్లెలి పాత్ర చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అందుకే చేశాను” అని తెలిపింది.