Mrunal-Dhanush: ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ వార్తలు దక్షిణాది చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరు కలిసే ఈవెంట్‌లకు హాజరవుతున్నారు. బయట జంటగా కనిపిస్తున్నారు. వీరిద్దరి క్లోజ్‌నెస్ చూసిన సినీ వర్గాలు ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం నిజమేనంటూ చెబుతున్నారు.
బాలీవుడ్ మూవీ ప్రీమియర్‌కు…
మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ సన్నాఫ్ సర్ధార్ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రీమియర్‌కు మృణాల్‌తో కలిసి ధనుష్ అటెండ్ కావడంతో వీరిద్దరి రిలేషన్‌పై గుసగుసలు మొదలయ్యాయి. ఆ తర్వాత మృణాల్ పుట్టిన రోజు వేడుకల్లో ధనుష్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read – Santosham Awards 2025: ఘనంగా సంతోషం అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ వేడుక
ధనుష్ సిస్టర్స్‌తో…
ధనుష్ ఫ్యామిలీతో మృణాల్ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ధనుష్ సిస్టర్స్ కార్తీక, విమలగీతలకు మృణాల్ మంచి ఫ్రెండ్‌గా మారిందని అంటున్నారు. స్వయంగా ధనుష్ తన సిస్టర్స్‌ను మృణాల్‌కు పరిచయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిని మృణాల్ ఇటీవలే కలిసినట్లు చెబుతోన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ సిస్టర్స్‌ను మృణాల్ ఫాలో అవుతుంది. వీరిద్దరు కూడా మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అనుసరిస్తున్నారు. కార్తీక, విమలగీత ఇద్దరూ డాక్టర్స్. సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. వారు సడెన్‌గా మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఖాతాను ఫాలో కావడం డేటింగ్ వార్తలకు బలాన్ని చేకూర్చింది. వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ నెటిజన్లు చెబుతోన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తోనే వీరిద్దరి దొరికిపోయారని అంటున్నారు. అయితే ఈ డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్‌తో పాటు ధనుష్ మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.
రజనీకాంత్ కూతురితో విడాకులు…
రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లిచేసుకున్న ధనుష్ మనస్పర్థల కారణంగా 2024లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గొడవలను పక్కనపెట్టి పిల్లల కోసం ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.
Also Read – Tollywood: బెట్టింగ్ యాప్స్ కేసు – ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ – నెక్స్ట్ ఎవరంటే?
సీతారామంతో ఎంట్రీ…
మరోవైపు మృణాల్ ఠాకూర్‌తో తెలుగుతో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది. ప్రభాస్ కల్కిలో గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం అడివిశేష్‌తో డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. తొలుత ఈ సినిమాలో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మృణాల్ డెకాయిట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.


