Dacoit: యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) వరుసగా థ్రిల్లర్ జోనర్ సినిమాలు తీస్తూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘డెకాయిట్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోసర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఈరోజు శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీలో హీరోయిన్ పాత్రను రివీల్ చేశారు. క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఇందులో నటిస్తున్నట్లు ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన విడుదల చేసిన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ‘అవును ప్రేమించావు. కానీ మోసం చేశావు. ఇడిచిపెట్టను…తేల్చాల్సిందే’ అంటూ అడవి శేష్ పోస్టర్ విడుదల చేయగా.. ‘అవును వదిలేస్తాను. .కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’ అంటూ మృణాల్ మరో పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో మూవీపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.