Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: AA22XA6 షూటింగ్‌లో జాయిన్ అయిన మృణాల్

Allu Arjun: AA22XA6 షూటింగ్‌లో జాయిన్ అయిన మృణాల్

Mrunal Thakur: అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న AA26XA6 మూవీలో అందాల తార మృణాళ్ ఠాకూర్ నటించనున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అట్లీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్‌లో ఆమె జాయిన్ అయినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు తన కెరీర్‌లోనే అతి పెద్ద సినిమాని చేస్తోంది. అల్లు అర్జున్‌తో ఆమె స్క్రీన్‌ను పంచుకుంటోంది. ఈ మూవీలో దీపికా పడుకోనే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మృణాల్ ఒక కీలక పాత్రను చేస్తోందని సమాచారం. ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన వీఎఫ్ఎక్స్ స్టూడియోలో మృణాల్‌కు సంబంధించిన సన్నివేశాలను తీస్తున్నారు. ఒక యాక్షన్ సీన్ కోసం అక్కడ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

“ఇదొక భారీ యాక్షన్ ఎపిసోడ్. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో కలిసి మృణాల్ షూటింగ్‌లో పాల్గొంటోంది” అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిజానికి, కొన్ని నెలల క్రితమే ఈ మూవీలో మృణాల్ భాగమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని నిర్మాతలు భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నది కాబట్టి త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు.

Also Read: https://teluguprabha.net/cinema-news/mega-star-chiranjeevi-lodge-police-complaint-over-ai-generated-deepfack-content/

AA26XA6 చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలో జరగనుంది. అందిన సమాచారం ప్రకారం ముంబై షెడ్యూల్ ఏకంగా 130 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సినిమాకి పనిచేయడానికి ఇప్పటికే ఇంటర్నేషనల్ టెక్నీషియన్ల బృందం ముంబైకి చేరుకుంది. తన కెరీర్‌లోనే తొలిసారిగా అల్లు అర్జున్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. యాక్షన్ మేళవించిన సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్‌గా తయారవుతున్న ఇందులో ఆయన రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. లాయిడ్ స్టీవెన్స్ శిక్షణలో ఆయన మేకోవర్ అయ్యారు కూడా. వీఎఫ్ఎక్స్, ఏఐ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad