Anirudh Ravichander: అనిరుధ్…ప్రస్తుతం సౌత్ మ్యూజిక్ డైరెక్టర్లలో నంబర్‌వన్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఒకప్పుడు తమిళంలో విజయ్ (Thalapathy Vijay), రజనీకాంత్ (Rajinikanth) లాంటి స్టార్ హీరోల సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ పేరు వినిపించేది. గత కొన్నాళ్లుగా రెహమాన్ మ్యూజిక్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. వరుస డిజాస్టర్లతో రెహమాన్ కెరీర్‌లో డౌన్‌ఫాల్ మొదలైంది. మెల్లమెల్లగా రెహమాన్‌ను పక్కనపెట్టిన స్టార్స్…అనిరుధ్‌కే ప్రయారిటీ ఇస్తున్నారు.
జననాయగన్.. కూలీ…
ప్రస్తుతం తమిళంలో విజయ్ జననాయగన్ (Jana Nayagan), రజనీకాంత్ కూలీతో (Coolie) పాటు పలు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ అనిరుధ్ మ్యూజిక్‌కు మంచి క్రేజ్ ఉంది. కొందరు తెలుగు స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్‌గా కావాలని పట్టుపడుతున్నట్లు సమాచారం. ఈ క్రేజ్‌ను గట్టిగానే క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట అనిరుధ్. తెలుగు సినిమాల కోసం తన రెమ్యూనరేషన్‌ను పెంచినట్లు సమాచారం.
Also Read – Snakes: వంటింట్లో ఇవి ఉంటే పాములు వెత్తుకుంటూ వస్తాయి!!
పదిహేను కోట్లు…
ఇక నుంచి ఒక్కో తెలుగు సినిమాకు పదిహేను కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవాలని అనిరుధ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కింగ్డమ్‌తో పాటు నాని పారడైజ్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు అనిరుధ్. ఈ రెండు సినిమాల కోసం పన్నెండు కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం. ఇంత భారీ రెమ్యూనరేషన్ మన దగ్గర ఎవరూ తీసుకోవటం లేదు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సైతం తన రెమ్యూనరేషన్ పది కోట్లుగా మాత్రం తీసుకుంటున్నారని సమాచారం. కానీ ఆయన్ని మించి అనిరుధ్ పదిహేను కోట్లు డిమాండ్ చేయటం డిస్కషన్ పాయింట్ అయినప్పటికీ, ఆయన సంగీతానికున్న క్రేజ్‌ను అనుసరించి మేకర్స్ అనిరుధ్ అడిగినంత ఇవ్వటానికి రెడీ అవుతున్నారు.
అనిరుధ్ ఛాయిస్…
టాలీవుడ్‌లోనూ పాన్ ఇండియన్ కల్చర్ బాగా పెరిగింది. హీరోల ఇమేజ్‌కు తగ్గట్లుగా అన్ని భాషల ఆడియెన్స్‌ను మెప్పించేలా మ్యూజిక్ ఇవ్వడంలో అనిరుధ్ మినహా మరో ఛాయిస్ కనిపించడం లేదు. అందుకే అతడు డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read – 8th pay commission: 8వ వేతన సంఘం.. కమ్యూటెడ్ పెన్షన్ డిమాండ్ అంటే ఏమిటి..?
పవన్ అజ్ఞాతవాసితో…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అజ్ఞాతవాసి (Agnyaathavaasi) సినిమాతో టాలీవుడ్‌లోకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. నాని గ్యాంగ్‌లీడర్, జెర్సీతో (Jersy) పాటు ఎన్టీఆర్ దేవర (Devara) పార్ట్ వన్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. గత ఏడాది జవాన్ (Jawan) సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా పెద్ద హిట్ అందుకున్నాడు.


