Saturday, November 15, 2025
HomeTop StoriesBheems Ceciroleo: ఫ్యామిలీతో స‌హా చ‌నిపోవాల‌నుకుని సెల్ఫీ వీడియో తీసుకున్నా.. భీమ్స్ సిసిరోలియో ఎమోషనల్ స్పీచ్

Bheems Ceciroleo: ఫ్యామిలీతో స‌హా చ‌నిపోవాల‌నుకుని సెల్ఫీ వీడియో తీసుకున్నా.. భీమ్స్ సిసిరోలియో ఎమోషనల్ స్పీచ్

Bheems Ceciroleo: జీవితం ఎవరికీ పూలబాట కాదు.. చాలా మంది జీవితాల‌ను గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. తాజాగా మాస్ జాత‌ర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడిన మాట‌లు వింటే మ‌రోసారి ఈ సామెత గుర్తుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. తన పాటలు, సంగీతంతో అందరినీ అలరించే సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో ‘మాస్‌ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. ఒకప్పుడు అవకాశాలు లేక తీవ్ర నిరాశలో కుటుంబంతో సహా చనిపోదాం అనుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో దేవుడిలా రవితేజ తనను కాపాడాడని, ఆయన లేకపోతే తాను లేనని భీమ్స్‌ సిసిరోలియో వెల్లడించారు.

- Advertisement -

భీమ్స్ ఈ విష‌యంపై స్పందిస్తూ.. ఒకసారి తన పరిస్థితిని తెలుపుతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నానని వివరించారు. ఆ వీడియో తీస్తున్నప్పుడు తన భార్య, పిల్లలు కూడా అందులో కనిపించేలా ఉన్నారని, అయితే తాను ఎందుకు వీడియో తీస్తున్నానో అప్పుడు వాళ్లకు తెలియదని చెప్పారు. ఇంటికి అద్దె ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా బతకాలి అని ఆలోచిస్తూ ఆ వీడియో తీసినట్లు తెలిపారు. ఆ క్షణంలో తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే… ‘ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి. నాకు జీవితం లేదు. నా భార్యాపిల్లలకు కూడా జీవితం లేదు. అందరం కలిసి పైకి వెళ్లిపోదాం.. అనుకుంటున్నా’ అని తెలిపారు. సరిగ్గా ఆ చిట్టచివరి క్షణంలోనే తనకు ఒక ఫోన్‌ వచ్చిందని, పీపుల్స్‌ మీడియా ఆఫీసుకు రావాలి అని పిలవగా వెళ్లానని, ఆ కాల్‌ తన జీవితాన్ని మార్చేసిందని భీమ్స్‌ ఎమోషనల్ అయ్యారు.

Also Read – Suriya: కామ‌న్ మ్యాన్‌గా మొద‌లై ఈ స్టేజ్‌కి ఎద‌గ‌టం మామూలు విష‌యం కాదు: హీరో సూర్య‌

రవితేజ నా దేవుడు ఆ ఫోన్‌ రావడానికి ఒక్క క్షణం ముందు నిరాశలో ఉన్న తనకు దేవుడి రూపంలో రవితేజ నుంచి ఫోన్‌ వచ్చిందని భీమ్స్‌ సిసిరోలియో ఎమోష‌న‌ల్ అయ్యారు. రవితేజ అంటే మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి అని ఆయన తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ‘నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే, రోజూ అన్నం తింటున్నానంటే ఆయనే కారణం’ అని, ఒక్క మాటలో చెప్పాలంటే నేను సజీవంగా ఉన్నానంటే రవితేజనే కారణం అని స్పష్టం చేశారు. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉంటే నాలాంటి వారు ఎంతోమంది వస్తారని, ఎంతోమందికి రవితేజ స్ఫూర్తి అని అన్నారు. ప్రస్తుతం భీమ్స్‌ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

బిజీగా ఉన్న సంగీత దర్శకుడు 2012లో ‘నువ్వానేనా’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన భీమ్స్‌ సిసిరోలియో, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Also Read – Pragya Jaiswal: ప్రగ్యా పరువాల జాతర.. కుర్రకారు విల విల..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad