గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. శంకర్ డైరెక్షన్, చరణ్ యాక్టింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు. అయితే కొన్ని సీన్స్ మాత్రం బోరింగ్‌గా ఉందనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నానా హైరానా’ సాంగ్ సినిమాలో మేకర్స్ తొలగించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎంతో గ్రాండ్‌గా విజువల్ వండర్‌గా తీసిన ఈ పాట సినిమాలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత మంచి పాట ఎందుకు సినిమాలో పెట్టలేదు అని ఆరా తీస్తున్నారు.
ఈ పాటను సినిమా ప్రింట్‌లో అప్ లోడ్ చేసే క్రమంలో ఇన్‌ఫ్రారెడ్ చిత్రాల ప్రాసెసింగ్ సమయంలో టెక్నికల్ సమస్యలు తలెత్తాయని.. అందుకే ఫైనల్ కాపీలో యాడ్ చేయలేకపోయామని మేకర్స్ ప్రకటించారు. టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించడానికి తమ టీమ్ రాత్రిపగలు కష్టపడుతున్నారని.. జనవరి 14 నుంచి సినిమాలో ఈ పాటను యాడ్ చేస్తామని చెప్పారు. కాగా ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించబడిన మొట్టమొదటి భారతీయ పాటగా ‘నానా హైరానా’ తెరకెక్కింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కార్తీక్, శ్రేయో ఘోషల్ అద్భుతంగా పాడారు. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌లో అన్ని భాషలలో 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పెద్ద హిట్ అయింది.