Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభNag Ashwin : ప్రాజెక్ట్ K సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృస్టిస్తున్నాం..

Nag Ashwin : ప్రాజెక్ట్ K సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృస్టిస్తున్నాం..

- Advertisement -

Nag Ashwin : ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా సినిమాల లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో ప్రాజెక్ట్ K ఒకటి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు . ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా అమితాబ్, దిశా పటానిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

నాగ్ అశ్విన్ ఇప్పటికే ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాడు, పలు ట్వీట్స్ చేశాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తెలిపాడు.

నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K గురించి మాట్లాడుతూ.. ”ఈ సినిమా కోసం మేము ఒక కొత్త ప్రపంచాన్ని సృస్టిస్తున్నాం. మహానటి సినిమాలో మాకు పాత కార్లు కావాల్సి వస్తే రెంట్ కి తెచ్చుకున్నాం. కానీ ఈ సినిమాలో అలా కుదరదు. మాకు కావాల్సిన కార్లు మేమే తయారు చేసుకోవాలి. చాలా వరకు కొత్త పరికరాలని ఈ సినిమా కోసం తయారుచేస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. కథ కూడా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది” అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా ప్రభాస్ అభిమానులు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News