Nag Ashwin: కల్కి 2 నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది. కల్కి 2లో దీపికా భాగం కావడం లేదంటూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ చేసిన ట్వీట్ పెద్ద దూమారాన్నే రేపింది. స్పిరిట్, కల్కి2.. వరుసగా రెండు ప్రభాస్ సినిమాల నుంచి దీపికా పదుకొనె వైదొలగడంతో అసలు కారణం ఏమై ఉంటుందా అన్నది సినీ లవర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టోటల్ ఎపిసోడ్‌లో దీపికా పదుకొనెదే తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్, ట్వీట్స్ పెడుతున్నారు. కల్కి 2 నుంచి ఆమెను తప్పించి మంచి పనిచేశారంటూ చెబుతున్నారు. మరోవైపు దీపికా ఫ్యాన్స్ మాత్రం ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
కాగా కల్కి 2 నుంచి దీపికా పదుకొనె తప్పుకున్నట్లు వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసిన కొద్ది గంటల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. కల్కి 2898 ఏడీ మూవీలో కృష్ణుడు ఎంట్రీ ఇచ్చే సీన్‌ను పోస్ట్ చేశారు. ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే’ అనే డైలాగ్ ఈ వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్‌ను కూడా జోడించారు నాగ్ అశ్విన్. ‘జరిగిన దానిని ఎవరూ మార్చలేరు. కానీ తర్వాత ఏం జరగాలో మీరు నిర్ణయించుకోవచ్చు’ అంటూ కామెంట్ పెట్టారు. నాగ్ అశ్విన్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దీపికాను ఉద్దేశించే…
దీపికా పదుకొనెను ఉద్దేశించే నాగ్ అశ్విన్ ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఇన్‌డైరెక్ట్‌గా దీపికాపై సెటైర్లు వేసినట్లు పేర్కొంటున్నారు. దీపికా పదుకొనె లేకపోయినా కల్కి 2కు వచ్చే నష్టం ఏమి లేదని నాగ్ అశ్విన్ ఈ పోస్ట్‌తో చెప్పకనే చెప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రెమ్యూనరేషన్ ఎక్కువ…
కాగా దీపికా పదుకొనె కల్కి 2 నుంచి వైదొలగడానికి ఆమె పెట్టిన కొన్ని డిమాండ్లే కారణమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీక్వెల్ కోసం ఐదు నుంచి పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఎక్కువగా అడిగిందని అంటున్నారు. లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని అడిగిందట. అంతే కాకుండా షూటింగ్ టైమ్‌లో రోజుకు ఐదు గంటలు మాత్రమే పనిచేస్తానని, తన టీమ్ 25 మందికి ఫైవ్ స్టార్ వసతి, భోజనం కల్పించాలని ఆమె కండీషన్స్ పెట్టినట్లు చెబుతున్నారు.
Also Read- Bandla Ganesh: పెద్ద దర్శకులు, నిర్మాతలు సిగ్గుతో తల దించుకోవాలి.. దీనమ్మ ఇది కదా సినిమా అంటే
ఈ డిమాండ్ల వల్లే వైజయంతీ మూవీస్.. కల్కి 2 నుంచి దీపికా పదుకొనెను పక్కనపెట్టిందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీపికాను ట్రోల్ చేస్తూ నెటిజన్లు పెట్టిన ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోల్స్‌పై దీపికా పదుకొనె ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఈ విమర్శలకు ఎలా బదులిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.


