Wednesday, January 22, 2025
Homeచిత్ర ప్రభThandel : తండేల్ సినిమా నుంచి మూడో సింగిల్.. ఎప్పడంటే..?

Thandel : తండేల్ సినిమా నుంచి మూడో సింగిల్.. ఎప్పడంటే..?

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు.

- Advertisement -

ఓ నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ, సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ‘బుజ్జి తల్లి’ అనే పాట ట్రెండింగులో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని మూడో సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

‘హైలెస్సో హైలెస్స…’ అంటూ సాగే ఈ పాట మెలోడీగా రానుందని తెలుస్తోంది. ఈ పాటను శ్రేయా ఘోషల్‌తో పాటు అజీజ్ నాకాష్ పాడినట్లు తెలుస్తోంది. ఈ పాటను జనవరి 23న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దీనికి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారని, ఖచ్చితంగా ‘తండేల్’ మ్యూజికల్ హిట్ సాధిస్తుందని టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News