Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNaga Chaitanya: ఆ పాట కారణంగా శోభిత నాతో గొడవపడింది- చైతూ

Naga Chaitanya: ఆ పాట కారణంగా శోభిత నాతో గొడవపడింది- చైతూ

Naga Chaitanya- Sobhita: ‘తండేల్‌’ సక్సెస్‌ తర్వాత ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండుతో మిథికల్‌ థ్రిల్లర్‌ చేస్తున్న నాగచైతన్య.. శోభితతో తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఖాళీ టైం దొరికితే భార్యతో టైం స్పెండ్‌ చేస్తూ ఫారిన్‌ ట్రిప్పులు వేస్తున్న చైతూ.. ఇటీవల జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తండేల్‌ మూవీలోని ఓ పాట తర్వాత శోభిత తనతో చాలా రోజుల పాటు మాట్లాడలేదని చైతూ చెప్పాడు. ఇంతకీ ఏంటా పాట అంటే..

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/vijay-deverakonda-reacts-on-car-accident/

‘తండేల్‌’ మూవీలో ‘బుజ్జితల్లీ’ పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలియంది కాదు. సినిమా రిలీజ్‌ కంటే ముందే ఎంతో హైప్‌ క్రియేట్‌ చేసింది ఈ పాట. తండేల్‌ సక్సెస్‌లో ఇందులోని పాటలు కీలక పాత్ర పోషించాయి. అయితే ఈ పాట కారణంగా శోభిత తనతో చాలా కాలం పాటు మాట్లాడలేదని చైతూ స్వయంగా తెలిపాడు. ఈ పాట వెనుక ఉన్న ఫన్నీ ఇన్సిడెంట్‌ను షేర్‌ చేసుకున్నాడు.

శోభితను నేను ముద్దుగా బుజ్జితల్లీ అని పిలుస్తాను. అయితే తండేల్‌ మూవీలో ఆ పేరును సాయిపల్లవికి పెట్టడం.. ఆ పాటపైనే పేరు రావడంతో శోభిత నాపై అలిగింది. డైరెక్టర్‌కు నేనే ఆ పేరు సూచించానని అనుకుంది. కానీ నేను ఎందుకు అలా చేస్తా.. ఈ ప్రపంచంలో గొడవలు పడని దంపతులు ఉండరు. ఒకవేళ వారి మధ్య ఏ గొడవా జరగలేదంటే.. వారి మధ్య ప్రేమ లేనట్లే. అని చైతూ ఆ పాట వెనుక ఉన్న ఫన్నీ స్టోరీని చెప్పుకొచ్చాడు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/mithra-mandali-trailer-release/

కాగా, ఈ షోలో నాగచైతన్య తన లవ్‌స్టోరీని కూడా పంచుకున్నాడు. సోషల్‌ మీడియా వల్లే పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమకి దారి తీసిందని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన క్లౌడ్‌ కిచెన్‌ షోయు గురించి పెట్టిన పోస్ట్‌కి శోభిత ఎమోజీ కామెంట్‌ చేసిందని.. అనంతరం వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని చెప్పాడు. తన జీవిత భాగస్వామిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కలుస్తానని అస్సలు ఊహించలేదని చైతూ వివరించాడు. తన జీవితంలో శోభితకు అత్యంత ప్రాధాన్యత ఉందన్న చైతూ.. తను లేకుండా జీవించలేనని స్పష్టం చేశాడు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad