Nagarjuna 100 Film: నాగార్జున వందో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ అక్కినేని హీరో కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ దసరాకు అఫీషియల్‌గా లాంఛ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్ గెస్ట్‌లుగా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వందో సినిమా చాలా కాలం పాటు గుర్తుండిపోయే మంచి మూవీగా నిలవాలని స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే నాగార్జున పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టోరీతో పాటు బడ్జెట్, మేకింగ్ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని ఫిక్సైనట్లు సమాచారం. నాగార్జున కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా ఈ మూవీ రూపొందుతోందట. తమిళ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
నాగచైతన్య, అఖిల్ గెస్ట్ రోల్స్…
కాగా నాగార్జున వందో సినిమాలో ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఒకే సీన్‌లో కాకుండా వేర్వేరు సిట్యూవేషన్స్‌లో ఈ సినిమాలోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య, అఖిల్ గెస్ట్ రోల్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయట.
అక్కినేని హీరోలంతా కలిసి గతంలో మనం సినిమాలో కనిపించారు. వారి కెరీర్‌లోనే స్పెషల్ మూవీగా మనం నిలిచింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించారు. అఖిల్ గెస్ట్ రోల్ చేశాడు. మళ్లీ మనం తర్వాత నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే సినిమాలో కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. నాగార్జున వందో సినిమాకు 100 నాటౌట్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మల్టీస్టారర్‌ను ఇలా మార్చేశారా?
వందో సినిమాను నాగచైతన్య, అఖిల్‌తో కలిసి మల్టీస్టారర్‌గా చేయాలని నాగార్జున అనుకున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్‌రాజా ఈ మల్టీస్టారర్ మూవీకి దర్శకత్వం వహించాల్సింది. మోహన్‌రాజాతో సినిమా చేయనున్నట్లు నాగార్జున సైతం ప్రకటించారు. కానీ మోహన్‌రాజా సిద్ధం చేసిన కథ నచ్చకపోవడంతో నాగార్జున ఆ మూవీని పక్కనపెట్టారు. మల్టీస్టారర్ సినిమా కోరికను నాగచైతన్య, అఖిల్ గెస్ట్ రోల్స్‌తో ఫుల్‌ఫిల్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు నాగచైతన్య, అఖిల్ లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
Also Read – Mutual fund SIP: ఎంత సిప్ కడితే రూ. కోటి వస్తుంది? అలా ఎన్నేళ్లు కట్టాలో తెలుసా!


