Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభNaga Chaitanya : కొత్త గర్ల్ ఫ్రెండ్ తో చైతూ.. నెటిజన్ల విమర్శలు

Naga Chaitanya : కొత్త గర్ల్ ఫ్రెండ్ తో చైతూ.. నెటిజన్ల విమర్శలు

నాగచైతన్య – సమంత విడిపోయి అప్పుడే ఏడాది గడిచిపోయింది. విడాకుల తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సమంత బిజీ గా ఉంటున్న సమయంలోనే.. మయోసైటిస్ అనే వ్యాధి ఆమెను కుంగదీసింది. అయినా ధైర్యంగా ఎదుర్కొంటానంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటోంది. సమంతతో విడాకుల అనంతరం.. నాగచైతన్య బాగా ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. కొత్త గర్ల్ ఫ్రెండ్ తో చైతన్య చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నాడన్నది ఆ ప్రచారం. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఈ జంట కలిసి కనిపించింది. శుక్రవారం ఈ జంట కలిసి కనిపించిన ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న ప్రచారానికి బలం చేకూరినట్లైంది. సమంత అభిమానులు చైతూపై మండిపడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మాజీ భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే.. కనీసం పలకరించకుండా కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఆనందంగా గడపడం పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రచారం శోభిత, చైతన్య స్పందిస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News