అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి కలిసి నటిస్తున్న ‘తండేల్’(Tandel)సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘బుజ్జి తల్లి’ సాంగ్ సినిమా ప్రేమికుల మనసు గెలుచుకుంది. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ‘నమో నమః శివాయ’ సాంగ్ కుడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని స్థానిక మత్స్యకారులతో నాగ చైతన్య సరదాగా గడిపాడు.
షూటింగ్ ఆఖరి రోజు ఇచ్చిన మాట ప్రకారం చేపల పులసు స్వయంగా వండాడు. అక్కడి స్థానికులతో పాటు చిత్రబృందానికి తన వంట రుచి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. “యేటలో చేపలు పట్టేసాక.. మంచి పులుసు ఎట్టేయాలి కదా.. తండేల్ రాజా ఆకా యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ షూటింగ్‌లో స్థానికుల కోసం నోరూరించే చేపల పులుసు వండారు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.