అక్కినేని యువ హీరో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన ‘తండేల్’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా చైతూ సతీమణి శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ సినిమాపై చైతూ చాలా ఫోకస్ పెట్టారని..మూవీ చేస్తున్నన్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా “ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా ఈ మూవీలో మత్స్యకారుడి పాత్రలో నటించిన చైతన్య చాలా రోజులుగా గడ్డంతోనే ఉన్నారు.
ఇక భార్య శోభిత పోస్టుపై నాగచైతన్య స్పందిస్తూ “థ్యాంక్యూ మై బుజ్జి తల్లి” అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఇలాగే కలకాలం కలిసి ఉండాలంటూ నెటజిన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా నాగచైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ‘తండేల్’ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్సాన్స్ వస్తోంది.