Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNaga Chaitanya: బుల్లితెర‌పై అద‌ర‌గొట్టిన తండేల్ - నాగ‌చైత‌న్య కెరీర్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ!

Naga Chaitanya: బుల్లితెర‌పై అద‌ర‌గొట్టిన తండేల్ – నాగ‌చైత‌న్య కెరీర్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ!

Thandel: నాగ చైతన్య తండేల్ మూవీ బుల్లితెర‌పై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. తండేల్ వ‌ర‌ల్డ్ టీవీ ప్రీమియ‌ర్ ఇటీవ‌ల జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యింది. ఈ ప్రీమియ‌ర్‌కు ఏకంగా 10.32 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. సోలో హీరోగా నాగ‌చైత‌న్య కెరీర్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్న మూవీగా తండేల్ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కినేని హీరోలు క‌లిసి న‌టించిన మ‌నం మూవీకి 15.62 టీఆర్‌పీ వ‌చ్చింది. ఈ సినిమాలో తాత అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, తండ్రి నాగార్జుల‌తో క‌లిసి నాగ‌చైత‌న్య న‌టించాడు.

- Advertisement -

టాప్ త్రీ మూవీస్‌…
ఈ ఏడాది తెలుగులో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకున్న సినిమాల్లో తండేల్ మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్‌లో సంక్రాంతికి వ‌స్తున్నాం ఉంది. 15.92 టీఆర్‌పీతో ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో వెంక‌టేష్‌ మూవీ నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ…12.61 టీఆర్‌పీతో సెకండ్ ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది. ఈ రెండు సినిమాల త‌ర్వాత టీవీలో పెద్ద హిట్టుగా తండేల్ ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందింది.

Also Read – Ktr fires on bjp: బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం: తెలంగాణ ఉనికిని విస్మరిస్తున్నారా?

సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌…
తండేల్ మూవీలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. ల‌వ్‌స్టోరీ త‌ర్వాత ఈ మూవీతో మ‌రో బిగ్‌హిట్‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు చైతూ, సాయిప‌ల్ల‌వి. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ 100 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. 2025లో టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా తండేల్‌ నిలిచింది.

రా అండ్ ర‌స్టిక్ రోల్‌…
శ్రీకాకుళం మ‌త్స్య‌కారుల జీవితాల‌కు ప్రేమ‌, దేశ‌భ‌క్తి అంశాల‌ను జోడిస్తూ చందూ మొండేటి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో తండేల్ రాజుగా రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో త‌న న‌ట‌న‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు నాగ‌చైత‌న్య‌. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్స‌య్యింది. తండేల్ మూవీని బ‌న్నీవాస్ ప్రొడ్యూస్ చేశారు.

Also Read – Coolie: నో టీజ‌ర్‌, ట్రైల‌ర్ – కూలీ మేక‌ర్స్ వెరైటీ ప్ర‌యోగం.. లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్లానింగే వేరు!

విరూపాక్ష ఫేమ్‌…
తండేల్ త‌ర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. బీవీఎస్ఎస్ ప్ర‌సాద్‌తో క‌లిసి డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. స‌ర్ధార్ ఫేమ్ పీఎస్ మిత్ర‌న్‌తో నాగ‌చైత‌న్య ఓ మూవీ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad