Ye Maaya Chesave: నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయ చేశావే ప్రేక్షకుల ముందుకొచ్చి పదిహేనేళ్లు అవుతోంది. అయినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ జూలై 18న థియేటర్లలో రీ రిలీజైంది. ఫస్ట్ డేనే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. శుక్రవారం రిలీజైన పలు స్ట్రెయిట్ సినిమాల కంటే ఏ మాయ చేశావే మూవీ ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం.
ఓవర్‌సీస్‌లో…
శుక్రవారం రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు వంటి సిటీలో ఏ మాయ చేశావే స్పెషల్ చాలా వరకు హౌజ్‌ఫుల్స్ అయ్యాయి. ఓవర్‌సీస్‌లో కొన్ని చోట్ల ఏ మాయ చేశావే స్పెషల్ షోస్ వేశారు. అక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోయినట్లు సమాచారం.
Also Read – Mega 157 Leaks: మెగా 157 లీక్స్ వీడియో వైరల్.. వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు
నలభై ఐదు లక్షలు…
మొత్తంగా ఫస్ట్ డే నాగచైతన్య, సమంత మూవీకి నలభై ఐదు లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. టైర్ 2 హీరోల రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా ఏ మాయ చేశావే నిలిచింది. శనివారం రోజు కూడా ఇరవై లక్షల వరకు కలెక్షన్స్ దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం రోజు వర్షాల ఎఫెక్ట్ హైదరాబాద్‌లోని చాలా షోస్‌పై పడింది. లేదంటే ఫస్ట్ డే ఈ సినిమా అరవై లక్షలకుపైగా కలెక్షన్స్‌ను రాబట్టి ఉండేదని చెబుతున్నారు.
సమంత అరంగేట్రం…
ఏ మాయ చేశావే సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. 2000 ఏడాదిలో రిలీజైన ఈ మూవీతోనే సమంత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌బాబు సోదరి మంజుల ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీని నిర్మించింది. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత తమ కెమిస్ట్రీతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమా విజయంలో కీలకంగా నిలిచింది.
పరిచయం ప్రేమగా…
ఏ మాయ చేశావే షూటింగ్ సమయంలోనే నాగచైతన్య, సమంత మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2017లో ఈ జంట పెళ్లిపీటలెక్కారు. మనస్పర్థల కారణంగా నాలుగేళ్లలోనే విడాకులు తీసుకున్నారు.
Also Read – Aryaveer Kohli: కోహ్లీ వారసుడు వచ్చేస్తున్నాడు? కోహ్లీకి ఏమవుతాడో తెలుసా?
తండేల్…
ఈ ఏడాది తండేల్‌తో పెద్ద హిట్‌ను అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు హారర్ కామెడీ మూవీ శుభంతో నిర్మాతగా మారింది సమంత. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ రోల్‌లో కనిపించింది. తొలి సినిమాతోనే నిర్మాతగా హిట్‌ను దక్కించుకున్నది. ప్రస్తుతం హిందీలో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.


