Naga Shaurya: నాగశౌర్య హిట్టు అనే మాట విని నాలుగైదేళ్లు అవుతోంది. కమర్షియల్ బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. రంగబలి ఫెయిల్యూర్ తర్వాత సినిమాలకు రెండేళ్లు బ్రేక్ తీసుకున్న నాగశౌర్య బ్యాడ్ బ్యాయ్ కార్తీక్‌తో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బ్యాడ్ బాయ్ కార్తీక్ తెరకెక్కబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. జాతర ఎపిసోడ్‌తో ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. నాగశౌర్య ఎలివేషన్లు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. మాస్ రోల్‌లో నాగశౌర్య చెప్పిన పంచ్ డైలాగ్స్, ఆటిట్యూడ్ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు… కానీ స్మార్ట్ బాయ్‌లా ఉన్నావు… గురి తప్పలేదు… తప్పించా… మీరొచ్చింది నా కోసమేనని తెలుసుకొని కొడదామని అనుకున్నా. కాదని తెలిసిందిగా.. కొట్టి తెలుసుకుంటా అంటూ టీజర్‌లోని డైలాగ్స్ ఆసక్తిని పంచుతున్నాయి.
Also Read – Public Holiday: ఎగిరి గంతేసే వార్త.. అక్టోబర్ 7న పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు.. ఉత్తర్వులు జారీ..!
నువ్వు ఫైర్ అయితే నేను వైల్డ్ ఫైర్…
టీజర్ చివరలో నువ్వు ఫ్లడ్డు అయితే నేను వరద… నువ్వు ఫైర్ అయితే నేను వైల్డ్ ఫైర్ ఇలాంటి డైలాగ్స్ నీకు అవసరమా అంటూ వెన్నెల కిషోర్ వేసిన పంచ్ డైలాగ్ నవ్విస్తోంది. హరీస్ జైరాజ్ బీజీఎమ్ మెప్పిస్తోంది.
ఫ్లాప్‌లకు బ్రేక్ పడుతుందా?
బ్యాడ్‌బ్యాయ్ కార్తీక్ మూవీలో నాగశౌర్యకు జోడీగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది. నటి పూర్ణ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. సాయికుమార్, సముద్రఖని, నరేష్ విజయ్ కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బ్యాడ్‌బాయ్ కార్తీక్ సక్సెస్ నాగశౌర్య కెరీర్‌కు కీలకంగా మారింది. అతడి ఫ్లాప్‌లకు ఈ సినిమాతో అయినా బ్రేక్ పడుతుందో? లేదో? ఇంట్రెస్టింగ్‌గా మారింది. చివరగా 2023లో రిలీజైన రంగబలితో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగశౌర్య. కామెడీకి మంచి పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సినిమా ఆడలేదు.
Also Read – SIMRAN CHOUDHARY: సిమ్రాన్ చౌదరి గ్లామర్ అటాక్! ఫ్రెష్ అండ్ బోల్డ్ ట్రీట్!


