Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNaga Shaurya Wedding : ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్‌తో హీరో నాగశౌర్య వివాహం..

Naga Shaurya Wedding : ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్‌తో హీరో నాగశౌర్య వివాహం..

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య. ఇటీవల వచ్చిన కృష్ణ వ్రింద విహారి సినిమాతో మంచి విజయం సాధించాడు. కొన్ని రోజుల క్రితమే నాగశౌర్య అన్నయ్య వివాహం చేసుకున్నాడు. ఇటీవలే నాగషూర్య పెళ్లి గురించి కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరగనుందని కుటుంబ సభ్యులు ఇటీవల తెలిపారు. దేశంలోనే టాప్ ఇంటీరియర్ డిజైనర్స్ లో అనూష శెట్టి ఒకరు. తన ఓన్ కంపెనీతో అనేక ఖరీదైన ఇళ్ళకి తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంది అనూష.

శనివారం రాత్రి నాగశౌర్య, అనూష ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగగా నేడు ఉదయం బెంగుళూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad