Nagarjuna 100 Movie: హీరోగా నాగార్జున వందో సినిమా ఖరారైంది. తమిళ దర్శకుడితో ఈ మైల్‌స్టోన్ మూవీ చేయబోతున్నారు నాగార్జున (Nagarjuna Akkineni). జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో ద్వారా స్వయంగా నాగార్జున తన వందో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ వందో మూవీకి తమిళ డైరెక్టర్ ఆర్ఏ కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించాడు. ఏడాది క్రితం కార్తీక్ కథ చెప్పాడని, చాలా నచ్చిందని నాగార్జున అన్నారు. ఆరేడు నెలలుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా వందో మూవీ ఉండబోతుందని, లార్జ్ స్కేల్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వందో సినిమా షూటింగ్ మొదలవుతుందని నాగార్జున ప్రకటించారు.
Also Read- HHVM OTT date: ‘హరిహర వీరమల్లు’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరో రెండు భాషల్లో పెండింగ్ ఎందుకు!
రెండో సినిమా…
డైరెక్టర్‌గా కార్తీక్‌కు ఇది రెండో మూవీ. గతంలో నిథమ్ ఒరు వానమ్ అనే తమిళ మూవీకి దర్శకత్వం వహించాడు. అశోక్ సెల్వన్, రీతూవర్మ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగులో ఆకాశం పేరుతో రిలీజైంది. మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం హిట్టవ్వలేదు.
అచ్చిరాలేదు.. మరి నాగార్జున వంటి కమర్షియల్ హీరోని కొత్త దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడనేది అందరిలో మెదులుతున్న ఆలోచన. నాగార్జున కెరీర్ మైల్ స్టోన్ మూవీ ఇది.
కాగా నాగార్జునకు కోలీవుడ్ డైరెక్టర్లు అంతగా అచ్చిరాలేదు. తమిళ డైరెక్టర్లతో నాగార్జున చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. బావనచ్చాడు, స్నేహమంటే ఇదేరా, కృష్ణార్జున, డాన్, గగనం, రక్షకుడు..తో పాటు తమిళ దర్శకులతో నాగార్జున చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇటీవల రిలీజైన కూలీతో ఈ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయ్యింది.
Also Read- Rukmini Vasanth: బ్లాక్ డ్రెస్ లో ఫిదా చేస్తున్న కన్నడ బ్యూటీ, ఫోటోలు వైరల్
ఫస్ట్ టైమ్ విలన్…
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన కూలీ (Coolie) మూవీలో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నాగార్జున విలన్‌గా నటించాడు. సైమన్ పాత్రలో స్టైలిష్‌గా కనిపించాడు. కానీ నాగార్జున పాత్రను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రను ముగించిన తీరుపై మాత్రం ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నాగార్జున ఇమేజ్‌కు తగ్గ క్యారెక్టర్ కాదంటూ విమర్శిస్తున్నారు. కాన్సెప్ట్ కూడా ఔట్‌డేటెడ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టాక్‌తో సంబంధం లేకుండా కూలీ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. కూలీ మూవీలో ఆమిర్‌ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర, సౌబీన్ షాహిర్‌తో పాటు శృతి హాసన్ కీలక పాత్ర చేసింది.


