KING 100: కింగ్ నాగార్జున ఫ్యాన్స్‌కు కావాల్సిన ఫీస్ట్ రెడీ అవుతోంది! ‘కూలీ’ సినిమాలో తన విలన్ స్వాగ్‌తో అంచనాలు పెంచేసిన మన్మథుడు, ఇప్పుడు తన 100వ చిత్రం కోసం మామూలు ప్లాన్ వేయలేదు. ఈ సినిమా టైటిల్, కాంబినేషన్ చూస్తుంటే…సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి!
‘లాటరీ కింగ్’ అసలు మ్యాటర్ ఏంటి?
నాగార్జున 100వ సినిమాకు దాదాపుగా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందని ఇండస్ట్రీ టాక్. క్లాస్ సినిమా తీసే డైరెక్టర్ ఆర్. కార్తీక్ ను తీసుకొచ్చి, ఈ మాస్ టైటిల్‌తో సినిమా చేయించడం చూస్తుంటే, ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉందనే రూమర్ గట్టిగా నడుస్తోంది. ఒకరు కూల్‌గా ఉంటే, ఇంకొకరు పక్కా మాస్ అవతార్ లో కనిపిస్తాడు అని టాక్ గట్టిగా వినిపిస్తుంది.కింగ్ ఎప్పుడూ రొమాన్స్‌లో తగ్గేది లేదు. అందుకే, ఈసారి ఏకంగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు నాగ్ పక్కన స్టెప్పులేయబోతున్నారని సమాచారం. ఇదంతా పక్కా మాస్, యాక్షన్, రొమాన్స్ మిక్స్‌డ్ ఫార్ములా అని ఫిక్స్ అయిపోండి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్ అవడం అంటేనే, పక్కా చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అని ఫిక్స్ అయిపోవచ్చు. DSP బీట్స్ తో నాగ్ వేసే స్టెప్పులు థియేటర్ల మోత మోగించడం ఖాయం!
ALSO READ: https://teluguprabha.net/cinema-news/war-2-hrithik-jr-ntr-netflix-ott-release-oct-9-2025/
అక్కినేని ఫ్యామిలీ ‘బిగ్ ట్రీట్’
ఈ 100వ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే ఒక రూమర్ నడుస్తోంది. అదేంటంటే… నాగార్జున కొడుకులు, నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్స్‌లో కనిపించబోతున్నారట. ఇది నిజమైతే, ‘మనం’ తర్వాత అక్కినేని హీరోలందరూ మళ్ళీ ఒకే స్క్రీన్‌పై కనిపించినట్టే. ఇది ఫ్యాన్స్‌కి పండగే కదా. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.అన్నపూర్ణ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న ఈ ‘కింగ్ 100’ సినిమా, నాగార్జున కెరీర్‌లో మరో ట్రెండ్ సెట్టర్‌గా నిలవడం ఖాయమంటున్నారు.


