Anushka Shetty: నాగార్జున వందో సినిమా ఇటీవలే అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జానర్ ఏంటి? హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్నది మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. కానీ ఈ వందో సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా నాగార్జున వందో సినిమా రూపొందుతోందట. ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. పొలిటికల్ లీడర్‌గా, సామాన్యుడిగా డిఫరెంట్ షేడ్స్‌తో నాగార్జున క్యారెక్టర్స్ సాగుతాయని అంటున్నారు. కాగా ఈ సినిమాలో సీఏం పాత్ర కూడా ఉంటుందట. ఈ రోల్ కోసం అనుష్క శెట్టిని మేకర్స్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. వందో సినిమా కోసం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాగార్జున, అనుష్క కలిసి పనిచేయబోతున్నారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్ మూవీతోనే హీరోయిన్‌గా అనుష్క కెరీర్ మొదలైంది. ఆ తర్వాత డాన్, ఢమరుకం, రగడ సినిమాల్లో నాగార్జున, అనుష్క జంటగా కనిపించారు. కింగ్, కేడీ, సొగ్గాడే చిన్ని నాయనా సినిమాల్లో నాగార్జున కోసం గెస్ట్ రోల్స్ చేసింది అనుష్క. చివరగా వీరిద్దరి కాంబినేషన్‌లో 2017లో ఓం నమో వెంకటేశాయ రూపొందింది. లాంగ్ గ్యాప్ తర్వాత నాగార్జున, అనుష్క కలిసి సినిమా చేయబోతుండటంతో వందో సినిమాపై అంచనాలు పెరిగాయి.
Also Read- Balagam Venu: నాని, నితిన్… ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ – ఎల్లమ్మపై కొత్త రూమర్?
ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా వందో సినిమాను నిర్మిస్తున్నారు.
దర్శకుడిగా కార్తీక్‌కు ఇది రెండో సినిమా. గతంలో ఆకాశం అనే సినిమాను తెరకెక్కించారు. మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా ఈ మూవీ ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు. ఇటీవలే ఘాటీ మూవీతో దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కథనార్ మూవీతో ఈ ఏడాది మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనుష్క.
Also Read- Deepshikha Nagpal: కెమెరా ముందు దుస్తులు తీసేసావా?.. నా కూతురు సీడీని విరిచేసింది


