Kubera Review: వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల నాలుగేళ్ల తర్వాత చేసిన సినిమా ‘కుబేర’. నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. కొన్ని గంటల్లో థియేటర్స్‌లో సందడి చేయనున్న ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. మూవీ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే.. కుబేర సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి, పాత్రలు, వాటి లుక్స్, గ్లింప్స్ తో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సినిమా ప్రీమియర్స్ చూసిన వారు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
నాగార్జున, ధనుష్, రష్మిక మెయిన్ రోల్స్‌లో నటించిన ‘కుబేర’ గురించి డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ముగ్గురు వేర్వేరు మనస్తత్వాలున్న వ్యక్తులు.. వారి ప్రపంచాలు.. ఒకరి ప్రపంచంలోకి మరొకరు వచ్చినప్పుడు ఏం జరిగిందనేదే కథ. ఇప్పటి వరకు రానటువంటి జోనర్ మూవీ అని శేఖర్ కమ్ముల అండ్ టీమ్ సినిమా ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పేశారు. సినిమా సిల్వర్ స్క్రీన్‌పై రావటానికి రెండేళ్లు పట్టింది. అంతకుముందు ఏడాదిన్నర పాటు శేఖర్ కమ్ముల కథను సిద్ధం చేశారు.
‘కుబేర’ గురించి ఫ్యాన్స్, నెటిజన్స్ పాజిటివ్‌గా పోస్ట్స్ చేస్తున్నారు. నాగార్జున, ధనుష్ నటన అద్భుతంగా ఉందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఫస్ట్ పార్ట్ చాలా రేసీగా ఉందని..నాగార్జున పాత్ర చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ధనుష్ తన రోల్‌లో ఒదిగిపోయి.. పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడని అంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం సూపర్బ్‌గా ఉందని, దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్ రేంజ్‌కు తీసుకెళ్లారని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
కొందరు సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు కూడా. సినిమాలో ధనుష్ పెర్ఫామెన్స్ మాత్రమే గొప్పగా ఉందని, మిగిలిన సినిమా అంతా చాలా స్లోగా ఉందని వాళ్లు చెబుతున్నారు. ధనుష్ ఇండియాలోని బెస్ట్ యాక్టర్స్‌లో ఒకరని అందరూ అప్రిషియేట్ ట్వీట్స్ చేస్తున్నారు. మూవీ లెంగ్త్ ఎక్కువగా ఉందని, నాగార్జున-ధనుష్ పాత్రలను చక్కగా డిజైన్ చేశారని, శేఖర్ తనదైన స్టైల్లో కథను జెన్యూన్‌గా తెరకెక్కించారని, నెటిజన్స్ పేర్కొంటున్నారు.
‘కుబేర’ ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ చాలా బావుందని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల రైటింగ్ చాలా బావుందని నెటిజన్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, కుబేర మరో స్టైల్‌లో ఉందని చూస్తుంటేనే అర్థమవుతుంది. డబ్బు చుట్టూ లోకం తిరుగుతుంది అనే పాయింట్‌ను డైరెక్టర్ తనదైన కోణంలో విభిన్నంగా చెప్పటానికి ట్రై చేశారు.


