Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNagarjuna Akkineni: నాగార్జున మైల్‌స్టోన్ మూవీ.. రీమేక్‌పై క‌న్నేసిన కింగ్

Nagarjuna Akkineni: నాగార్జున మైల్‌స్టోన్ మూవీ.. రీమేక్‌పై క‌న్నేసిన కింగ్

Nagarjuna 100 Movie: అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల నాగ్ కుబేర మూవీలో కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ మూవీలోనూ ముఖ్య పాత్రను చేస్తున్నారు. ఇందులోనే కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, తమిళ నటుడు సత్యరాజ్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. హీరోగా నాగార్జున 99 చిత్రాలు చేసినప్పటికీ ముఖ్య పాత్రలను చేసిన సినిమాలు అంతకుమించే ఉన్నాయి.

- Advertisement -

హీరోలకి మైల్ స్టోన్ మూవీ ఎంతో ప్రత్యేకం. అందుకే వారు కూడా 25, 50, 75, 100.. ఇలా ఓ మైల్ స్టోన్ మూవీకి కథ, దర్శకుడు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. నాగ్ ఇప్పుడు తన 100వ సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ ఆర్. కార్తీక్ చెప్పిన కథ నాగ్‌కి బాగా నచ్చిందట. అందుకే, ఈ సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, సైలెంట్‌గా మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం.

Also Read – Anirudh Ravichander: అనిరుద్ నెగెటివ్ సెంటిమెంట్‌.. భ‌య‌ప‌డుతోన్న య‌ష్ ఫ్యాన్స్

వాస్తవానికి నాగ్ 100వ సినిమా అంటే పెద్ద దర్శకుడు ఉంటారని అందరూ అనుకున్నారు. వారి అంచనాలను తారుమారు చేస్తూ ఎప్పటిలాగే కొత్త దర్శకుడి ఛాన్స్ ఇచ్చారట. రాం గోపాల్ వర్మని, డాన్స్ మాస్టర్‌గా ఉన్న రాఘవ లారెన్స్ లాంటి ఎందరో కొత్త దర్శకులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నాగ్ తన 100వ సినిమాకి కూడా ఇదే పద్ధతిలో తమిళంలో ఒకే ఒక్క సినిమా చేసిన ఆర్. కార్తీక్ కి ఛాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక నాగ్ 100వ సినిమా రీమేక్ అని కూడా తెలుస్తోంది. కోలీవుడ్ లో శశికుమార్ చేసిన ‘అయోది’ చిత్రం నాగ్ కి బాగా నచ్చిందట. ఈ మూవీపై ఆయన బాగా ఆసక్తి చూపిస్తున్నారని ఇదే కథను తన 100వ సినిమాగా చేయాలనుకుంటున్నట్టు సమాచారం. 2023లో విడుదలైన మెలోడ్రామా సినిమా తమిళంలో డీసెంట్ హిట్ గా నిలిచింది. మంత్రిరా మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌కి బాగా పేరొచ్చింది. నాగార్జున కి అన్నీ వర్గాలలో ఆడియన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా నాగ్@100 సినిమాకి సంబంధించిన అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తోంది.

Also Read – AI+ Smartphones: 50MP AI కేమెరా, 5000mAh బ్యాటరీతో కేవలం రూ.4,999కే AI+ స్మార్ట్ ఫోన్స్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad