Nagarjuna Remunaration : తెలుగులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీవీ షోస్‌లో బిగ్‌బాస్ (Bigg Boss Telugu) ఒకటి. ఇప్పటివరకు బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించి ఎనిమిది సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. త్వరలోనే తొమ్మిదో సీజన్ లాంఛ్ కాబోతుంది. సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ 9 మొదలుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాగార్జున హోస్ట్…
ఈ కొత్త సీజన్‌కు మరోసారి హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) వ్యవహరించబోతున్నాడు. హోస్ట్‌గా నాగార్జునకు ఇది ఏడో సీజన్. బిగ్‌బాస్ 3 నుంచి నాగార్జుననే ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా కొనసాగుతోన్నాడు. బిగ్‌బాస్ 9కు నాగార్జున కాకుండా మరో స్టార్ హీరో హోస్ట్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది. బాలకృష్ణ, చిరంజీవి, నానితో పాటు పలువురు హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ బిగ్‌బాస్ 8 సక్సెస్‌తో మరోసారి నాగార్జుననే హోస్ట్‌గా కంటిన్యూ చేసింది స్టార్ మా.
రెమ్యూనరేషన్…
కాగా ఈ కొత్త సీజన్ కోసం నాగార్జున భారీగానే రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ 9 కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. నాగార్జునకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా బిగ్‌బాస్ నిర్వహకులు కూడా ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు తెలిసింది. బిగ్‌బాస్ ద్వారా తెలుగులో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హోస్ట్‌గా నాగార్జున రికార్డ్ క్రియేట్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
టీవీ యాక్టర్స్…
సెప్టెంబర్ 7న జరుగనున్న బిగ్‌బాస్ లాంఛ్ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు అటెండ్ కాబోతున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ సీజన్ 9కు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందట. ఈ కొత్త సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొనబోతున్నట్లు పలువురు టీవీ, సినిమా యాక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపికా రంగరాజుతో పాటు గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్లు సాయికుమార్, ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్ బిగ్‌బాస్9లోకి కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతోన్నారు. వీరితో పాటు తేజస్వి గౌడ, ఇమ్మాన్యుయేల్, సుమంత్ అశ్విన్, కల్పిక గణేష్, రేఖ భోజ్, దేబ్జానీ మోదక్, రీతూ చౌదరి, ఏక్‌నాథ్ కూడా కంటెస్టెంట్స్‌గా పాల్గొనున్నట్లు చెబుతోన్నారు. గత సీజన్స్‌కు భిన్నంగా బిగ్‌బాస్ 9 కోసం కొత్త హౌజ్ సెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. వైల్డ్ కార్డ్‌తో పాటు గేమ్స్, ఎలిమినేషన్ విషయంలో ఈ సారి రూల్స్ కొత్తగా ఉంటాయని అంటున్నారు.
కొత్త రూల్స్…
సినిమాల విషయానికి వస్తే నాగార్జున విలన్‌గా నటించిన కూలీ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.


