హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios)ను నిర్మించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. బండలు, రాళ్ళు, రప్పలున్న చోట అన్నపూర్ణ స్టూడియోకు పునాదులు పడ్డాయని తెలిపారు. రోడ్లే లేని రోజుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యం నాన్న గారు ఎలా స్థాపించారో అర్థం కావడం లేదన్నారు. ఈ స్టూడియో నుంచి ఎంతో మంది టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నటులు వచ్చారని గుర్తు చేసుకున్నారు. అలాగే మరెంతో మంది సిబ్బందికి ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.
ఎంతో మందికి నాగేశ్వరరావు గారు స్ఫూర్తి అని కొనియాడారు. ఈ స్టూడియోలోని ప్రతీ స్థలం తన తల్లిదండ్రులు ఫేవరెట్ స్పాట్ అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుందని సామెతకు అనుగుణంగా… తన తండ్రి ఏఎన్నార్ విజయం వెనుక తల్లి అన్నపూర్ణమ్మ ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.