Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో చక చకా తెలుగులో రెండు సినిమాలలో ఛాన్స్ అందుకుంది. వాటిలో ఒకటి నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’.. ఇంకో సినిమా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
కానీ ముందు నటించిన సీతారామం (Sita Ramam), హాయ్ నాన్న సినిమాలు మాత్రం మృణాల్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. వాస్తవానికి ఇలా ఒక్క ఫ్లాప్ వస్తే గ్యారెంటీగా కెరీర్ కాస్త స్లో అవుతుంది. మృణాల్ కి అలాంటి పరిస్థితే వచ్చింది. కల్కి లో చిన్న రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో మృణాల్, అడివి శేష్ (Adivi Sesh)కి గాయాలయ్యాయి. అయినా, షూటింగ్ ని పూర్తి చేశారు. ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ భారీ ఆశలనే పెట్టుకుంది. ఎందుకంటే డెకాయిట్ హిట్ అయితే మరి కొన్ని సినిమాలను లైనప్ చేయవచ్చుననేది మృణాల్ ఆలోచనగా కనిపిస్తోంది.
Also Read – Mirai Movie: భారీ ఢీల్ క్లోజ్..?
అయితే, తాజాగా ఓ స్టార్ హీరో మృణాల్‌కి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో ఒకసారి అక్కినేని హీరోతో మృణాల్ క్లోజ్‌గా ఉంటోందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత దీని గురించి ఎక్కడా న్యూసే లేదు. అయితే, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna Akkineni) మృణాల్‌కి ఆమె వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు నెట్టింట కొత్తగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడే కాదు, మృణాల్ మన టాలీవుడ్‌లో ఎంటరవకముందే అందాల ఆరబోతలో టాప్.
చాలా ఫొటో షూట్స్‌లో స్కిన్ షో బాగా చేసింది. రాను రాను అది మరీ ఎక్కువైంది. ముంబై నేపథ్యం కాబట్టి సాధారణంగా హీరోయిన్స్ ఇలాగే ఉంటారు. కాకపోతే టాలీవుడ్‌లో మృణాల్ చేసినవన్నీ చాలా డీసెంట్ మూవీస్. ఆ ఇంపాక్ట్ కాస్త సినిమా మీద పడితే ఆమెకే నష్టం. బహుశా నాగార్జున తన డ్రసింగ్ విషయంలో కొంచెం సలహాలిచ్చి ఉంటారు. కానీ, దీని గురించి ఎక్కడా ఎవరూ స్పందించలేదు. చూడాలి మరి నిజంగా మృణాల్‌కి వార్నింగ్ ఇచ్చిన హీరో ఎవరో.
Also Read – Diabetes: ఈ పండ్లు డయాబెటిస్ రోగులు తినాల్సిందే!


