Tuesday, January 7, 2025
Homeచిత్ర ప్రభNagarjuna: ప్రధాని మోదీకి ధన్య‌వాదాలు తెలిపిన నాగార్జున

Nagarjuna: ప్రధాని మోదీకి ధన్య‌వాదాలు తెలిపిన నాగార్జున

ఆదివారం జరిగిన ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) దిగ్గజ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు నాగేశ్వరరావు అని ప్రధాని కొనియాడారు. ఆయన తన సినిమాల్లో భారతీయ విలువలు, సంప్రదాయాలను, సంస్కృతిని చక్కగా చూపించేవారని ప్రశంసించారు. దీనిపై నాగార్జున(Nagarjuna)తో పాటు నాగచైతన్య(Naga Chaitnya)దంపతులు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

“దిగ్గజ నటుల సరసన మా నాన్న గారిని కూడా గౌరవించినందుకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. అది కూడా మా నాన్న గారి శతజయంతి వేళ ఈ ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు. భారతీయ సినీ రంగం పట్ల ఆయన దూరదృష్టి, అందించిన సేవలు అనేక తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. మీ ప్రత్యేక ప్రస్తావనతో మా కుటుంబానికి, మా నాన్న గారి నటనను ప్రేమించే కోట్లాది అభిమానులకు ఎంతో సంతోషం కలిగింది” అని నాగార్జున ట్వీట్ చేశారు.

ఇక “అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారి క‌ళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ప్రధాని మోదీ గారు అభినందించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్ర‌శంస‌లు పొంద‌డం మా అదృష్టం. మీకు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు” అని చైతూ, శోభిత పోస్టులు పెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News