Akkineni Family: టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీని అజాతశత్రువుగా చెబుతుంటారు. ఆది నుంచి వివాదాలకు దూరంగా ఉంటోన్న ఈ కుటుంబం కొన్నాళ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నాగచైతన్య విడాకులు, ఎన్ కన్వెషన్ కూల్చివేత… వరుస సమస్యలు అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అక్కినేని హీరోలు నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
పరువు నష్టం దావా కేసు…
కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసులో నాగార్జునతో పాటు నాగచైతన్య స్టేట్‌మెంట్‌ను బుధవారం జడ్జీ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ పరువు నష్టం దావా కేసుకు సంబంధించే తాము కోర్టుకు వచ్చినట్లు నాగార్జున మీడియాతో వెల్లడించారు. కోర్టు నుంచి నాగార్జున, నాగచైతన్య ఒకే కారులో వెళ్లిపోయారు. ఈ పరువు నష్టం కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
Also Read – Diabetes: ఈ కూరగాయలు తింటే.. షుగర్ లెవెల్స్ కంట్రోల్..
సమంతపై ఆరోపణలు…
గతంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే తరుణంలో సమంతపై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వల్లనే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని, అతడి వల్ల ఎంతో మంది సెలిబ్రిటీల జీవితాలు నాశనమయ్యాయని కామెంట్స్ చేసింది కొండా సురేఖ.
నాగార్జునకు చెందిన ఎన్ కన్వేన్షన్‌ను కూలగొట్టకుండా ఉండాలనే సమంతను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ బ్లాక్‌మెయిల్ చేశాడని, ఈ గొడవ వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారంటూ కొండ సురేఖ అన్నది. ఆమె మాటలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దూమారాన్నే రేపాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్ సినీ ప్రముఖులంతా తప్పుపట్టారు. సమంతతో పాటు అక్కినేని ఫ్యామిలీకి అండగా నిలిచారు. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. చాలా రోజులుగా కేసుపై విచారణ సాగుతోంది.
డైరెక్టర్‌తో ప్రేమాయణం…
కాగా సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య… శోభిత ధూలిపాళ్లను పెళ్లిచేసుకున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో వీరి వివాహం జరిగింది. మరోవైపు విడాకుల తర్వాత టాలీవుడ్‌కు దూరమైన సమంత బాలీవుడ్‌లోనే వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరు కలిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రేమ వార్తలపై సమంత ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.
Also Read – Sonakshi Sinha legal notice: నా ఫోటోలు తొలగించండి, లేకపోతే చర్యలు తప్పవు! – సోనాక్షి సిన్హా


