Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAkhanda 2 OTT Rights: అఖండ 2 సరికొత్త రికార్డ్.. ఓటీటీ రైట్స్ ఎంతంటే!

Akhanda 2 OTT Rights: అఖండ 2 సరికొత్త రికార్డ్.. ఓటీటీ రైట్స్ ఎంతంటే!

Akhanda 2 OTT Rights: బాల‌కృష్ణ‌ (Nandamuri Balakrishna), డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుల‌ది టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రు క‌లిసి చేసిన సింహా (Simha), లెజెండ్‌ (Legend), అఖండ (Akhanda) బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ హ్యాట్రిక్ హిట్స్ త‌ర్వాత బాల‌కృష్ణతో అఖండ 2 (Akhanda 2) సినిమా చేస్తున్నాడు బోయ‌పాటి శ్రీను. అఖండ‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 25న (Akhanda 2 Release date) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుందనుకుంటే ఇప్పుడు వాయిదా ప‌డింది. డిసెంబ‌ర్ మొద‌టి లేదా రెండో వారంలో అఖండ 2 రిలీజ్ అవుతుందని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ షూటింగ్ ఇంకా కొంత పూర్తి చేయాల్సి ఉంది. అలాగే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా చాలా వ‌ర‌కు పెండింగ్‌లోనే ఉన్నాయ‌ని స‌మాచారం. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను హ‌డావిడిగా కంప్లీట్‌ చేయ‌డం కంటే కొంత టైమ్ తీసుకోవ‌డ‌మే మంచిద‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ సినిమా రిలీజ్‌ను వెన‌క్కి తీసుకెళ్లారు.

- Advertisement -

Also Read- OG Records: OG మేనియా..ఇదేం అభిమానం.. ఆ రికార్డ్‌పై క‌న్నేసిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌

అఖండ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టం ఒక‌టేతే.. బాల‌య్య‌, బోయ‌పాటి (Boyapati Srinu) వంటి క్రేజీ కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌టంతో అఖండ 2 మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ హ్యూజ్‌గా ఉన్నాయి. అందుకు త‌గిన‌ట్లే థియేట్రిక‌ల్, నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రుగుతుంద‌ని మూవీ వ‌ర్గాలంటున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు బాల‌కృష్ణ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రేట్‌తో అఖండ 2 ఓటీటీ హ‌క్కులు అమ్ముడ‌య్యాయంటున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) మూవీ పాన్ ఇండియా ఓటీటీ రైట్స్‌ను ఏకంగా రూ.80 కోట్ల‌కు (Akhanda 2 OTT Rights) కొనుగోలు చేశార‌ని స‌మాచారం. బాల‌క‌ష్ణ కెరీర్‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈసారి బాల‌య్య‌ను బోయ‌పాటి ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించ‌బోతున్నార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోంది.

Also Read- IND vs AUS : మెల్‌బోర్న్‌లో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌ రద్దు.. కారణం ఏమిటంటే?

అఖండ 2 మూవీలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ప్ర‌గ్యా జైశ్వాల్ కూడా న‌టిస్తోన్న‌సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ భ‌జ‌రంగీ భాయిజాన్‌లో కీల‌క పాత్ర పోషించిన బాలీవుడ్ న‌టి హ‌ర్షాలీ మెహ‌తా అఖండ 2తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. అఖండ 2లో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అఖండ 2 త‌ర్వాత డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌. ఎన్‌బీకే 111 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ఈటీవ‌ల అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad