Akhanda 2 Song: మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ టాలీవుడ్‌లో క్రేజీ కలయిక. వీరిద్దరూ కలిసి చేసిన సినిమా సింహా, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు నాలుగోసారి బాలకృష్ణతో బోయపాటి శ్రీను ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) సినిమా తీస్తున్నాడు. ఇది అఖండ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. మొదట ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా పడింది. డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో సినిమా విడుదల అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
లేటెస్ట్ సమాచారం మేరకు బోయపాటి 600 మంది డాన్సర్స్‌తో భారీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాదులో వేసిన భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరిస్తుండటం విశేషం. తమన్ సంగీతంలో బాలయ్య మాస్ మూమెంట్స్‌తో పాట ఫ్యాన్స్‌కి పూనకాలు రావటం పక్కా అని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అఖండ మూవీని మించి బాలయ్య ఇందులో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు.
Also Read – Asia Cup 2025: భారత్ వర్సెస్ పాక్ సూపర్-4 ఫైట్ నేడే.. ఇరు జట్ల ఫ్లేయింగ్ 11 ఇదే..!
క్రేజీ బిజినెస్..
‘అఖండ 2: తాండవం’ సినిమా ఓటీటీ హక్కులు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ పాన్ ఇండియా హక్కులను దాదాపు రూ.80 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇక ఈసారి బోయపాటి బాలయ్యను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారో అన్నది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్‌లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటి హర్షాలీ మెహతా అఖండ 2తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నది. అఖండ 2లో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.
NBK 111 అప్‌డేట్…
అఖండ 2 తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. ఎన్‌బీకే 111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే NBK 111 స్టార్ట్ కానుంది. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న సినిమా ఇది.
Also Read – IND vs PAK: సూపర్ 4 అంటే భయపడుతున్న టీమిండియా.. భారత్ తో మ్యాచ్ అంటే వణుకుతున్న పాక్..


