Balakrishna Movies: నందమూరి అభిమానులకు బాలకృష్ణ దసరా పండుగ రోజున మంచి కిక్ ఇచ్చే న్యూస్‌లను చెప్పేయబోతున్నారు. న్యూస్ కాకుండా న్యూస్‌లంటున్నారేంటనే ఆలోచన రాక మానదు. నిజమే! ఎందుకంటే ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాలను బాలకృష్ణ స్టార్ట్ చేయబోతున్నారని సినీ సర్కిల్స్ అంటున్నాయి. విజయ దశమికి ఈ సీనియర్ కథానాయకుడు ఏకంగా రెండు సినిమాలను స్టార్ చేస్తుండటం ఫ్యాన్స్‌కి సంతోషాన్నిచ్చే విషయమనే చెప్పాలి. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే దసరాకు బాలయ్య నుంచి రాబోతున్న రెండు సినిమాలను కూడా ఇది వరకు ఆయనతో పని చేసిన దర్శకులతోనే చేయబోతున్నారు.
హిట్ డైరెక్టర్‌తోనే..
బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన NB111ను దసరా రోజున పూజా కార్యక్రమాలతో షురూ చేయబోతున్నారు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇది వరకు వీరిద్దరూ కాంబోలో వచ్చిన వీర సింహా రెడ్డి (Veera Simha Reddy) బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వంద కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో సినిమా రానుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో తొలి షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇది వరకు బాలయ్యను చూపించని విధంగా పవర్‌ఫుల్ రోల్లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) చూపించబోతున్నారు.
Also Read – Bigg Boss Captaincy: రెండు గ్రూపులు కొట్టుకుని సంజనాను కెప్టెన్ చేసేశారుగా..!
క్రిష్‌తో మరోసారి..
నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణిని తెరకెక్కించి అందరి మన్ననలు అందుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ అయ్యింది. అయితే మరోసారి నందమూరి సీనియర్ హీరో ఆయనతో పని చేయబోతున్నారు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999ను క్రిష్ తెరకెక్కిస్తాడనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా దసరా రోజునే రాబోతుందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. ఇందులో నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) కలిసి నటించబోతున్నారని సమాచారం.
అఖండ 2తో బిజీగా…
బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2ను (Akhanda 2) పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. సెప్టెంబర్ 25న విడుదలవుతుందనుకున్న ఈ మూవీ కొన్ని సాంకేతిక కారణాలతో డిసెంబర్ మొదటి వారానికి వాయిదా పడింది (Akhanda 2 Release date). కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.
Also Read – Drug addiction : మత్తు కోరల్లో హైదరాబాద్.. 32 వేల మంది అరెస్ట్! యువతను చిత్తుచేస్తున్న డ్రగ్స్!


