Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAsian Tarakarama Theatre : ఏషియన్ తారకరామ థియేటర్ పునఃప్రారంభం

Asian Tarakarama Theatre : ఏషియన్ తారకరామ థియేటర్ పునఃప్రారంభం

నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో పునః నిర్మితమైంది. ప్రముఖ ఏసియన్ సంస్థ ఈ థియేటర్ ను తీసుకుని మరమ్మతులు చేసింది. పునర్నిర్మాణం కాగా.. తిరిగి ఏసియన్ తారకరామగా మారింది. హైదరాబాద్ లోని కాచిగూడ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఈ థియేటర్ ను సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతులమీదుగా ప్రారంభమైంది. ఈనెల 16 నుండి ఈ థియేటర్లో సినిమాల ప్రదర్శన మొదలుకానుంది.

- Advertisement -

కొత్తగా మరమ్మతులు నిర్వహించిన ఈ థియేటర్లో 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. 975 సీటింగ్ కెపాసిటీని 590కి తగ్గించారు. రిక్లైనర్ సీట్లను, సోఫాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి ‘అవతార్ 2’ సినిమాతో సినిమాల ప్రదర్శన మొదలు కానుంది. ఆ తర్వాత ధమాకా, సంక్రాంతికి విడుదల కానున్న ‘వీరసింహా రెడ్డి’ని కూడా ఇందులో ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా మూతపడి ఉన్న తారకరామ థియేటర్ ను దివంగత ఎన్టీఆర్ స్నేహితుడు, సినీ నిర్మాత నారాయణ్ కే దాస్ నారంగ్ మరమ్మతులు చేపట్టారు. తాజాగా ఆయన కుమారుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. మల్టీప్లెక్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా థియేటర్ ను పునర్నిర్మించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad