Akhanda 2 Shooting Update: నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna ) కథానాయకుడిగా, బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2: తాండవం’. (Akhanda 2) గతంలో ఘన విజయం సాధించిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై బాలయ్య అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా ప్రాధాన్యత మరింత పెరిగింది. బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందుతోందని టాక్.
తాజాగా, అఖండ2 సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్‌డేట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రీకరణ మోతుగూడెంలో నిరవధికంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అఘోరా గెటప్‌లో బాలకృష్ణ, హీరోయిన్ డూప్ కలిసి నటిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాలకృష్ణ ఎలాంటి డూప్ లేకుండా, స్వయంగా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దిగి అస్థికలు కలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది బాలయ్య తన సినిమా, పాత్ర పట్ల కనబరుస్తున్న అంకితభావాన్ని, వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను స్పష్టం చేస్తోందని నెటిజన్స్ అంటున్నారు.
Also Read – Andre Russell : రసెల్ వీడ్కోలు మ్యాచ్‌లో… విండీస్ ఓటమి!
‘అఖండ 2’ సినిమా విషయానికొస్తే, బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్ (Legend), అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న (Akhanda 2 Release Date) ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే రిలీజ్ డేట్ మారుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. డిసెంబర్‌లో అఖండ2 వచ్చే అవకాశాలెక్కువనే న్యూస్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అధికారిక ప్రకటన అయితే లేదు.
ఇప్పటికే విడుదలైన ‘అఖండ 2’ టీజర్ (Akhanda 2 Teaser) అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేసింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన విడుదలైన ఈ టీజర్, కేవలం 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను మరియు 5.9 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. నటీనటుల విషయానికి వస్తే, బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్ (Samyuktha Menon), ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ప్రత్యేకంగా భాగమవుతున్నారు. తొలి భాగంలో నటించిన జగపతి బాబుతో సహా పలువురు నటీనటులు ఈ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు.
Also Read – Kannappa Ott Date: మాట మార్చిన మంచు విష్ణు – నెల రోజుల్లోనే ఓటీటీలోకి కన్నప్ప – స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?


