Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBalakrishna Honor: నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అరుదైన గౌర‌వం.. స్పందించిన సీఎం చంద్రబాబు

Balakrishna Honor: నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అరుదైన గౌర‌వం.. స్పందించిన సీఎం చంద్రబాబు

Balakrishna Honor: నటసింహం అని అభిమానులు పిలుచుకునే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల కాలంలో వరుస అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆయనకు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. భారత సినీ చరిత్రలోనే ఎవ్వరికీ లభించని గుర్తింపు కావటంతో నందమూరి అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

- Advertisement -

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
బాలకృష్ణ సినీ రంగంలో హీరోగా ఓ వైపు కొన‌సాగుతున్నారు.. మరోవైపు బసవతారకం హాస్పిటల్ (Basavatarakam Hospitals) ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న ఈ గొప్ప సేవలను గుర్తించి యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ (UK World Book Of Records Gold Edition)లో ఆయనకు చోటు లభించింది. ఈ గౌరవం అందుకున్న ఏకైక నటుడిగా బాలయ్య నిలవడం విశేషం. ఇప్పటివరకు దేశ సినీ చరిత్రలో ఏ నటుడికీ ఇలాంటి అపూర్వ గుర్తింపు లభించలేదు. ఇది ఆయన నటనకు మించిన సేవా గుణానికి దక్కిన గుర్తింపు అనడంలో సందేహం లేదు.

ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ..‘హీరోగా బాలకృష్ణ జర్నీఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కటం ఆయన కృషికి నిదర్శనం’ అన్నారు.

Also Read – Sreeleela Dance Secret: ఎన్టీఆర్ ఇన్‌స్పిరేష‌న్‌తో శ్రీలీల‌.. ట్విస్ట్ రివీల్ చేసిన హీరోయిన్ త‌ల్లి

వరుస విజయాలు.. పురస్కారాలు

ఇటీవలే బాలకృష్ణ పద్మభూషణ్ (Padma Bhushan) అవార్డును సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఈ వరుస విజయాలు, పురస్కారాల పరంపరలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం బాలయ్య సినీ, సామాజిక రంగాలలోని అంకితభావాన్ని తెలియజేస్తుంది. బాలకృష్ణ కేవలం సినీ నటుడిగానే కాకుండా, హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో భాగ‌మ‌య్యారు. ఒక మంచి మనసున్న మనిషిగా బసవతారకం హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. బాలకృష్ణకు ఈ అరుదైన గుర్తింపు లభించడంతో ఆయ‌న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో బాలకృష్ణను ఘనంగా సత్కరించనున్నారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 (Akhanda 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొదట సెప్టెంబర్ 25న విడుదల చేయాలని భావించినప్పటికీ, డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా అఖండ 2 రానుంది.

Also Read – OG Movie: ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ – ఈ సారి ప‌వ‌న్ గ‌ట్టిగా కొట్టాల్సిందే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad