Nandamuri Mokshagna: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ(Prasant Varma) దర్శకత్వంలో మోక్షు హీరోగా లాంఛ్ కానున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన మోక్షజ్ఞ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. నందమూరి వారసుడు వస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్ల మోత మోగించారు. అప్పటి నుంచి మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి కోసం ప్రశాంత్ వర్మ ఓ అప్‌డేట్ ఇచ్చారు. యాక్షన్‌కి రెడీగా ఉండండి మోక్షు కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. అంతే సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
కాగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మూవీని విడుదల చేయనున్నారు. ఇక మోక్షు సరసన స్టార్ కిడ్ నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లో భాగంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.