Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Nani: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హీరో నాని ప్రశంసలు

Nani: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హీరో నాని ప్రశంసలు

Nani| నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘హిట్ 3’ సినిమాతో పాటు ‘దసరా’ డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా రానా(Rana) దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) గురించి నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టారే అని నాని తెలిపారు. ఆయన ప్రస్తుతం సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారని.. ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగారు.. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ఎదిగారని పేర్కొన్నారు. అక్కడ కూడా ఎంతో మందికి స్పూర్తినిచ్చారు అని కొనియాడారు. అలాగే రానా కూడా మాట్లాడుతూ పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని.. ఆయన నిజంగానే పవర్ స్టార్ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కాగా గతంలో పవన్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాల టికెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల ఇండస్ట్రీ తరపున నాని ఒక్కరే పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా తన గళం వినిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News