Nani-Koratala Combo Movie: టాలీవుడ్‌లో మరో కొత్త కాంబో సెట్టయినట్లు ప్రచారం జరుగుతోంది. హీరో నాని, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఓ మూవీ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మూవీతోనే నిర్మాతగా అజయ్‌దేవ్‌గణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతోన్నారు.
తెలుగు, తమిళ భాషల్లో…
స్వీయ నిర్మాణ సంస్థ అజయ్ దేవ్‌గణ్‌ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో సినిమాలను నిర్మించాలనే ప్రయత్నాల్లో అజయ్ దేవ్‌గణ్ ఉన్నట్లు బాలీవుడ్ సర్కిల్‌లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగు డెబ్యూ మూవీ కోసం అజయ్ దేవ్‌గణ్ చాలానే కథలు విన్నట్లు తెలిసింది. వీటిలో డైరెక్టర్ కొరటాల శివ చెప్పిన కథ నచ్చడంతో ఈ స్క్రిప్ట్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ఈ మూవీలో నాని హీరోగా నటించనున్నట్లు చెబుతోన్నారు.
నానితో ఫస్ట్ టైమ్…
డైరెక్టర్‌గా ఇప్పటివరకు ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతోనే సినిమాలు చేశారు కొరటాల శివ. ఫస్ట్ టైమ్ టైర్ 2 హీరో అయిన నానితో కొరటాల శివ మూవీ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. కొరటాల, నాని మూవీపై తొందరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
దేవర 2తో బిజీ…
ఎన్టీఆర్‌తో దేవర 2 సినిమా కమిటయ్యాడు కొరటాల శివ. దేవర పార్ట్ 1కు కొనసాగింపుగా ఈ సీక్వెల్ రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేసిన తర్వాతే దేవర 2 సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తవ్వడానికి ఏడాదిపైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ గ్యాప్‌లో నాని సినిమాను కంప్లీట్ చేయాలని కొరటాల శివ అనుకుంటున్నట్లు టాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో…
ప్రస్తుతం నాని… ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌ను ఈటీవలే మొదలుపెట్టాడు నాని. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది నాని… హీరోగా హిట్ 3తో, ప్రొడ్యూసర్‌గా కోర్ట్ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు.


