Monday, March 10, 2025
Homeచిత్ర ప్రభCourt Trailer: ఆసక్తికరంగా ‘కోర్ట్‌’ ట్రైలర్‌.. ప్రేక్షకులకు నాని ఛాలెంజ్

Court Trailer: ఆసక్తికరంగా ‘కోర్ట్‌’ ట్రైలర్‌.. ప్రేక్షకులకు నాని ఛాలెంజ్

నేచురల్ స్టార్ నాని సమర్పణలో ‘కోర్ట్’(Court) మూవీ తెరకెక్కింది. రామ్‌ జగదీశ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీలో హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా న‌టించారు. ప్రియ‌ద‌ర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి,‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను(Court Trailer) మేకర్స్ విడుద‌ల చేశారు.

- Advertisement -

త‌న కూతురుని ప్రేమించిన ఓ యువకుడిని ఆ అమ్మాయి తండ్రి అక్రమంగా అరెస్ట్ చేయించి బ‌య‌టికి రాకుండా ఎలా ప్లాన్ వేశాడనే స్టోరీ లైన్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఆ యువ‌కుడికి శిక్ష పడకుండా న్యాయవాది పాత్రధారి ప్రియ‌ద‌ర్శి ఎలాంటి న్యాయపోరాటం చేశాడనే కోణంలో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది.

మరోవైపు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులకు నాని(Nani) ఓ ఛాలెంజ్ విసిరారు.‘కోర్ట్’ చిత్రం ప్రేక్షకులకు నచ్చకపోతే తన రాబోయే మూవీ ‘హిట్-3’ చూడొద్దంటూ కోరాడు. మరి నాని కాన్ఫిడెన్స్ ప్రకారం మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియాలంటే మార్చి 14వ తేదీ వరకు ఆగాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News