Nani – Srinidhi: నాని హీరోగా నటించిన హిట్ 3 మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. తొలి అడుగులోనే పెద్ద విజయాన్ని అందుకున్నది. హిట్ 3 తర్వాత నాని, శ్రీనిధి శెట్టి మరోసారి జంటగా టాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బ్లడీ రోమియో…
నాని హీరోగా ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. దసరా సందర్భంగా ఈ సినిమా అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. డార్క్ హ్యూమర్ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ మూవీకి బ్లడీ రోమియో అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. నాని, సుజీత్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
హిట్ 3 తర్వాత…
కాగా ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అఫీషియల్‌గా శ్రీనిధి శెట్టి పేరును మేకర్స్ కన్ఫామ్ చేయనున్నారట. హిట్ 3 తర్వాత సుజీత్ మూవీ కోసం రెండోసారి నాని, శ్రీనిధి శెట్టి జతకట్టనున్నారు. శ్రీనిధి శెట్టితో పాటు కథలో మరో హీరోయిన్‌కు చోటు ఉందని ప్రచారం జరుగుతోంది.
నాని హీరోగా నటిస్తున్న 34వ సినిమా ఇది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read – SYG: సాయి దుర్గ తేజ్ బర్త్ డేకి బ్లాస్టింగ్ అప్‌డేట్..
ప్యారడైజ్…
ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కాబోతుంది. ది ప్యారడైజ్ మూవీలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల మోహన్‌బాబు లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
తెలుసు కదా…
మరోవైపు హిట్ 3 తర్వాత తెలుగులో తెలుసు కదా సినిమా చేస్తోంది శ్రీనిధి శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి నీరజ కోన దర్శకత్వం వహిస్తోంది. అక్టోబర్ 17న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజ్ అవుతోంది. తెలుసు కదా సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు రాశీఖన్నా మరో నాయికగా కనిపించబోతున్నది. కన్నడంలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో శ్రీనిధి శెట్టి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. యశ్ హీరోగా నటించిన ఈ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా శ్రీనిధి శెట్టికి మాత్రం కన్నడంలో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో టాలీవుడ్‌కు షిప్టయ్యింది ఈ బ్యూటీ.
Also Read – Nobel Prize Tension: “నోబెల్ నాకే.. లేదంటే అమెరికాకే అవమానం!” – ట్రంప్ కొత్త పల్లవి!


